Moviesఆయనగారు గొప్ప యాక్టర్ కాదు..ప్రభాస్ పై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..?

ఆయనగారు గొప్ప యాక్టర్ కాదు..ప్రభాస్ పై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..?

కంగనా రనౌత్.. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉన్నది ఉన్నట్లు మొహానే చెప్పడం ఆమె అలవాటు. హిందీలో ఆమె ఓ ఫైర్ బ్రాండ్.. అంతేకాదు మంచి నటిగా కూడా పేరు సంపాదించుకున్నారు. చలన చిత్ర పరిశ్రమలో తన నటనతో స్టార్ హీరోలతో సమానమైన స్థానాన్ని సంపాదించుకుంది. పాత్రకి అనుగుణంగా ఆమె చూపే నటనా కౌశల్యాన్ని అభిమానులు ఎంతగానో ఇష్టపడతారు.

ఆమె ఇప్పటికే మణికర్ణిక, తలైవి అంటూ పలు బయోపిక్‌ల్లో నటించారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ ‘తలైవి’లో టైటిల్‌ రోల్‌ చేసిన కంగనా రనౌత్‌ వెంటనే ఇందిరాగాంధీ పాత్ర చేయనుండడం మరో విశేషం. కాగా కంగనా రనౌత్ ప్రభాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రభాస్ గొప్ప నటుడేమి కాదు అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

కంగనా రనౌత్-ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ఏక్ నిరంజన్…. 2009లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఏక్ నిరంజన్ సినిమాలో ప్రభాస్ సరసన కంగనా రనౌత్ నటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ టైంలో వీళ్ళ మధ్య ఏదో చిన్న గొడవ జరిగిందట. దీంతో వీరి మధ్య చిన్న అభిప్రాయ భేదాలు వచ్చాయట.

ఇక గతంలో ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొనగా..ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది కంగనా రనౌత్. “ఏక్ నిరంజన్ సినిమాలో నటిస్తున్న సమయంలోనే ప్రభాస్ ఫస్ట్ టైం చూశా… అప్పుడు ఆయన్ని చూసినప్పుడు పెద్ద గొప్ప నటుడు ఏం కాడు అనుకున్నా.. కానీ, బాహుబలి చూసాక నా ఆభిప్రాయం తప్పనిపించింది. ప్రభాస్ ఇంత గొప్ప నటుడు అవుతాడని అసలు ఊహించుకోలేదట.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news