Moviesన‌టుడుతో టాప్ లేడీ సింగ‌ర్ పెళ్లి...

న‌టుడుతో టాప్ లేడీ సింగ‌ర్ పెళ్లి…

లాక్‌డౌన్ వేళ ఎంతో మంది ప్ర‌ముఖులు పెళ్లి పీట‌లు ఎక్కుతున్నారు. టాలీవుడ్‌లోనే న‌లుగురు హీరోలు ఈ లాక్‌డౌన్‌లో పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఓ టాప్ లేడీ సింగర్ ఓ నటుడును పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతోంది. బాలీవుడ్‌ ప్రముఖ సింగర్‌ నేహా కక్కర్‌ నటుడు రోహన్‌ప్రీత్‌ను పెళ్లాడుతుందంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. వీరి వివాహం ఈ నెలాఖ‌ర్లోనే ఢిల్లీలో జ‌ర‌గ‌నుంద‌ట‌. ఈ పెళ్లి వార్త‌ల‌కు బ‌లం క‌లిగేలా తాజాగా నేహా, రోహన్‌తో ఉన్న ఫొటోను షేర్‌ చేసి.. ‘‘నువ్వు నా వాడివి’’అంటూ క్యాప్షన్‌ జతచేసింది. దీంతో వారిద్ద‌రు పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్నార‌న్న హింట్ వ‌చ్చింది.

 

 

ఇక నేహ కామెంట్‌కు స్పందించిన రోహ‌న్ అదే ఫోటోను నెటిజ‌న్ల‌తో పంచుకున్నాడు. నా జిందగీ నేహా కక్కర్ – నేహా.. లవ్‌ యూ సో మచ్‌.. నేను నీ వాడినే అని కామెంట్ చేశాడు. దీంతో ప‌లువురు నెటిజ‌న్లు నేహ‌, రోష‌న్‌కు శుభాకాంక్ష‌లు చెపుతున్నారు. కాబోయే వ‌ధూవ‌రులు అని కూడా కొంద‌రు కామెంట్లు పెడుతున్నారు. ఇండియన్‌ ఐడల్ ద్వారా వెలుగులోకి వచ్చిన నేహా కక్కర్ తర్వాతి సీజన్‌లో అదే కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించి ఎంతో మంది ఫ్యాన్స్‌ను సొంతం చేసుకుంది.

 

అయితే నేహ గ‌తంలో మ‌రో నటుడు హిమాన్షు కోహ్లితో ప్రేమలో ఉన్నట్లు చెప్పినా వారి మ‌ధ్య బేధాభిప్రాయాలు రావ‌డంతో విడిపోయారు. ఆ త‌ర్వాత నేహ ప‌లు ఆల్బ‌మ్స్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. రోహన్‌ప్రీత్‌, ముజ్‌ సే షాదీ కరోగీ అనే వెడ్డింగ్‌ రియాలిటీ షోతో గుర్తింపు తెచ్చుకున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news