Moviesమ‌హేష్‌బాబు చెల్లెలు ఇప్పుడు ఎలా ఉందో చూశారా.. మీరు గుర్తు ప‌ట్ట‌లేరు..!

మ‌హేష్‌బాబు చెల్లెలు ఇప్పుడు ఎలా ఉందో చూశారా.. మీరు గుర్తు ప‌ట్ట‌లేరు..!

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్‌బాబు కెరీర్‌లో 2003 సంక్రాంతికి వ‌చ్చిన ఒక్క‌డు సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా ఏకంగా 130 కేంద్రాల్లో 100 రోజులు ఆడి అప్ప‌టి వ‌ర‌కు ఉన్న తెలుగు సినిమా రికార్డుల‌కు పాత‌రేసింది. ఈ సినిమాలో మ‌హేష్‌కు చెల్లిగా న‌టించింది బేబీ నిహారిక‌. అంత‌కు ముందే ఆమె మోహ‌న్‌బాబు హీరోగా న‌టించిన య‌మ‌జాత‌కుడు సినిమాలో మోహ‌న్‌బాబుకు మేన‌కోడ‌లిగా న‌టించింది.

 

అయితే య‌మ‌జాత‌కుడు ప్లాప్ అయ్యాక ఆమెను ఎవ్వ‌రూ గుర్తించ‌లేదు. ఒక్క‌డు హిట్ అయ్యాక ఆమెకు మంచి క్రేజ్ వ‌చ్చింది. ఆ త‌ర్వాత కొన్ని ఆఫ‌ర్లు వ‌చ్చినా ఆమె వాటిని వ‌దులుకుని చ‌దువుపై కాన్‌సంట్రేష‌న్ చేసింది. ఇప్పుడు చ‌దువు పూర్త‌వ్వ‌డంతో ఆమె సినిమాల్లో హీరోయిన్ అవ‌కాశాల కోసం ఎంతో ట్రై చేస్తోంది. ఇక ఇటీవ‌ల నిహారిక‌కు సంబంధించిన లేటెస్ట్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతున్నాయి.

 

ఒక్క‌డులో నిహారిక‌ను ఇప్ప‌టి నిహారిక‌ను చూస్తే మ‌నం అస్సలు గుర్తు ప‌ట్ట‌లేం. బాలీవుడ్‌కు చెందిన ఓ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించే సినిమాలో ప్రాధాన్యం ఉన్న పాత్ర‌లో ఆమె న‌టిస్తోందంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇక నిహారిక హీరోయిన్‌గా ఎలా మెప్పిస్తుందో ?  చూడాలి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news