Moviesవంట‌ల‌క్క దెబ్బ‌తో బిగ్‌బాస్ ఢ‌మాల్

వంట‌ల‌క్క దెబ్బ‌తో బిగ్‌బాస్ ఢ‌మాల్

స్టార్ మా ఛానెల్లో ప్ర‌సారం అవుతోన్న వంట‌ల‌క్క గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ ఒక్క సీరియ‌ల్ ఒక ఎత్తు.. మిగిలిన అన్ని తెలుగు బుల్లితెర ప్రోగ్రామ్ అన్ని మ‌రో ఎత్తు అన్నా ఆశ్చ‌ర్య పోవాల్సిన ప‌నిలేదు. వంట‌ల‌క్క అనే పాత్ర తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు ఎంత‌గా క‌నెక్ట్ అయ్యిందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఎన్ని తోపు ప్రోగ్రామ్‌లు వ‌చ్చినా వంట‌ల‌క్కదే టాప్ రేటింగ్‌. ఇక బిగ్‌బాస్ 4వ సీజ‌న్ భారీ అంచ‌నాల‌తో ప్రారంభ‌మైంది. రేటింగుల్లో బిగ్‌బాస్ దెబ్బ‌కు మిగిలిన బుల్లితెర ప్రోగ్రామ్స్ అన్ని ప‌డుకుంటాయ‌ని అనుకున్నారు.

 

 

అయితే ఐదో వారంలోకి వ‌చ్చేస‌రికే బిగ్‌బాస్ చేతులు ఎత్తేసింది. వంట‌ల‌క్క దెబ్బ‌కు బిగ్‌బాస్ ఢ‌మాల్ అయ్యింది. ఇక బిగ్‌బాస్‌ను కూడా ఏదో న‌డిపించాలి కాబ‌ట్టి న‌డిపిస్తున్నారు అన్న‌ట్టుగా ప‌రిస్థితి ఉంది. ఈ వారం వంట‌ల‌క్క టీఆర్పీ రేటింగ్స్‌లో తొలి స్థానంలో ఉంటే రెండో స్థానంలో ఇంటింటి గృహ‌ల‌క్ష్మి సీరియ‌ల్ ఉంది. త‌ర్వాత వ‌రుస‌గా వ‌దిన‌మ్మ‌, దేవ‌త‌, చెల్లిలి కాపురం సీరియ‌ల్స్ ఉన్నాయి. అస‌లు ఈ వ‌రుస‌లో బిగ్ ఎక్క‌డో ఉంది.

 

 

దీనిని బ‌ట్టి ఓ మామూలు డైలీ సీరియ‌ల్స్‌కు వ‌చ్చిన రేటింగ్ కూడా బిగ్‌బాస్‌కు రావ‌డం లేదు. దీనిని బట్టి బిగ్‌బాస్ నాలుగో సీజ‌న్ తుస్సుమంద‌నే చెప్పాలి. ఏదేమైనా మ‌న బుల్లితెర సీరియ‌ల్స్‌కు ప‌ట్టంక‌ట్టిన మ‌న మ‌హిళా మ‌హారాణులు బిగ్‌బాస్‌ను చాలా లైట్ తీస్కున్నార‌నే చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news