Gossipsముగ్గురు మెగా హీరోల‌తో బండ్ల గ‌ణేష్ బిగ్ మ‌ల్టీస్టార‌ర్‌..?

ముగ్గురు మెగా హీరోల‌తో బండ్ల గ‌ణేష్ బిగ్ మ‌ల్టీస్టార‌ర్‌..?

బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గ‌ణేష్ ముగ్గురు మెగా హీరోల‌తో ఓ మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేశాడా ? అంటే అవున‌న్న గుస‌గుస‌లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇందులో నిజానిజాలు ఎలా ?  ఉన్నా మెగా క్యాంప్ నుంచి ఈ వార్త‌లు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో సినిమా క‌న్‌పార్మ్ అయ్యింద‌ని ఇటీవ‌ల బండ్ల గ‌ణేష్ ట్వీట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే వీరి కాంబోలో గ‌తంలో వ‌చ్చిన గ‌బ్బ‌ర్‌సింగ్ సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది.

 

 

ప్ర‌స్తుతం ప‌వ‌న్ వ‌కీల్‌సాబ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత క్రిష్ మూవీ ప‌ట్టాలెక్క‌నుంది. ఆ త‌ర్వాత కూడా మూడు ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల‌ని కాద‌ని ప‌వ‌న్ ఇప్పుడు బండ్ల సినిమాకు ఓకే చెపుతాడా ? అన్న డౌట్లు అయితే ఉన్నాయి. ఇదిలా ఉంటే బండ్ల గ‌ణేష్ ప‌ర‌మేశ్వ‌ర ఆర్ట్స్ బ్యాన‌ర్లో ప‌వ‌న్ నటించే సినిమాలో మ‌రో ఇద్ద‌రు మెగా హీరోలు కూడా ఉంటార‌ని అంటున్నారు.

 

 

ఆ ఇద్ద‌రు మెగా హీరోలు ఎవ‌రో కాదు మెగాస్టార్ చిరంజీవి, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ అని తెలుస్తోంది. వీరు ముగ్గురు క‌ల‌యిక‌లో వ‌చ్చే సినిమా కోసం అదిరిపోయే క‌థ కోసం ఇప్పుడు బండ్ల‌తో పాటు కొంద‌రు ద‌ర్శ‌కులు వెతుకులాట‌లో ఉన్నార‌ట‌. ఈ ముగ్గురు కాంబినేష‌న్లో సినిమా అంటే అదిరిపోయే క‌థ ఉండాలి. ఇక ఒక‌రిద్ద‌రు డైరెక్ట‌ర్ల‌తో బండ్ల చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని.. ఈ విష‌యంలో త్వ‌ర‌లోనే క్లారిటీ వ‌స్తుందంటున్నారు. ఈ ముగ్గురు మెగా హీరోల మ‌ల్టీస్టార‌ర్ అంటే సినీ ప్రియుల ఆనందం మామూలుగా ఉండ‌దు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news