Gossipsరెండేళ్ల త‌ర్వాత తార‌క్ సినిమా రిలీజ్... స‌క్సెస్ కొట్టేనా..!

రెండేళ్ల త‌ర్వాత తార‌క్ సినిమా రిలీజ్… స‌క్సెస్ కొట్టేనా..!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన చివ‌రి సినిమా అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌. 2018లో వ‌చ్చిన ఈ సినిమాకు మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. త్రివిక్ర‌మ్ ఈ సినిమా కంప్లీట్ మాస్ , యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కించారు. త్రివిక్ర‌మ్ త‌న‌దైన స్టైల్‌కు భిన్నంగా ఈ సినిమాను తెర‌కెక్కించ‌డంతో సినిమాపై ఓ విధ‌మైన అంచ‌నాల‌తో వెళ్లిన వారు సినిమా చూసి షాక్ అయ్యారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాను ఇప్పుడు ఇత‌ర భాష‌ల్లోకి డ‌బ్ చేయాల‌ని చిత్ర యూనిట్ నిర్ణ‌యించింది.

 

ఇప్పుడు ఈ సినిమాను హిందీ, క‌న్న‌డ భాష‌ల్లోకి డ‌బ్ చేసి రిలీజ్ చేయాల‌ని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. మామూలుగానే తార‌క్ సినిమాల‌కు క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో డ‌బ్ చేసి రిలీజ్ చేసే అదిరిపోయే వ్యూస్ రావ‌డంతో పాటు అక్క‌డ మంచి క్రేజ్ ఉండేది. ఇప్పుడు ఈ సినిమాను కూడా రెండేళ్ల త‌ర్వాత క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లోకి డ‌బ్ చేసి రిలీజ్ చేసే ప్ర‌య‌త్నాలు ప్రారంభ‌మ‌య్యాయ‌ని తెలుస్తోంది. మ‌రి రెండేళ్ల త‌ర్వాత ఇత‌ర భాషల్లోకి డ‌బ్ అవుతోన్న ఈ సినిమా ఎలాంటి అంచ‌నాలు అందుకుంటుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news