Moviesలక్ అంటే లావణ్యదే.. రామ్ తో అలా కలిసి వచ్చింది..!

లక్ అంటే లావణ్యదే.. రామ్ తో అలా కలిసి వచ్చింది..!

అందాల రాక్షసిగా తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుంకున్న లావణ్య త్రిపాఠి ఇప్పుడు కెరియర్ లో మంచి ఫాంలో ఉందని చెప్పొచ్చు. తను నటించిన సినిమాలు ఫలితాలతో సంబంధం లేకుండా అమ్మడికి అవకాశాలు వస్తున్నాయి. ఇక అమ్మడికి లక్ కూడా బాగా కలిసి వస్తుందని చెప్పాలి. ఎలా అంటే రామ్ హీరోగా ఉన్నది ఒక్కటే జిందగి సినిమాలో అనుపమ పరమేశ్వరన్ తో పాటుగా తమిళ భామ లై హీరోయిన్ మేగా ఆకాష్ ను సెలెక్ట్ చేశారు. ఏమైందో ఏమో కాని అమ్మడు ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకుందట. ఇక లక్కీగా ఆ అవకాశం లావణ్య చెంత చేరింది.

తనది కాదనుకున్న ఆ సినిమా ఆఫర్ వచ్చేసరికి లావణ్య ఎగిరిగంతేసినంత పనిచేసిందట. నేను శైలజతో హిట్ కాంబోగా మారిన కిశోర్ తిరుమల, రామ్ కలిసి చేస్తున్న ఈ సినిమా కచ్చితంగా మరో సూపర్ హిట్ అందుకుంటుందని అంటున్నారు. ఇక లావణ్య కూడా ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా నటిస్తున్న యుద్ధం శరణం సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. అదే కాకుండా మరో రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయట. మొత్తానికి కెరియర్ స్టార్టింగ్ లో కాస్త ఇబ్బంది పడ్డా ఫైనల్ గా టాలీవుడ్ లో లావణ్య క్రేజ్ రోజు రోజుకి పెరుగుతుందని మాత్రం చెప్పొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news