Newsఏడేళ్ళ హైదరాబాద్ బుడతడు...నెలకు డెబ్భై వేలు సంపాదిస్తున్నాడు (వీడియో)

ఏడేళ్ళ హైదరాబాద్ బుడతడు…నెలకు డెబ్భై వేలు సంపాదిస్తున్నాడు (వీడియో)

బిటెక్‌లు, ఎంటెక్‌లు చదివిన వాళ్ళు కూడా చిన్న సమస్య వచ్చేసరికి ఎలా సూసైడ్ చేసుకుందాం అని ఆలోచించుకుంటూ ఉన్న కంప్యూటర్ కాలం ఇది. ఎంతో డెవలప్ అయ్యాం అని అనుకుంటూ ఉంటాం కానీ మానసికంగా మాత్రం రోజు రోజుకూ వీక్ అయిపోతూ ఉన్నాం. అలాంటి వాళ్ళందరికీ నేర్చుకునే ఉద్ధేశ్యం ఉండాలి కానీ ఈ బుడతడి జీవితం బోలెడన్ని పాఠాలు చెబుతుంది. తల్లిదండ్రులకు చదివించే స్తోమత లేదు. కనీసం పోషించేంత డబ్బు కూడా లేదు. అయినప్పటికీ ఆ హైదరాబాద్ చిచ్చర పిడుగు మాత్రం వెంటనే ఏ రైలు కిందనో తలపెట్టేయాలని ప్లాన్ చేసుకోలేదు. కొబ్బరి బోండాం కొట్టటం ఎలాగో పరిశీలిస్తూనే నేర్చుకున్నాడు.

ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్న ఓ బిజీ సెంటర్‌లో కొబ్బరిబోండాలు కొడుతున్నాడు. నెలకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా? అదే ప్రశ్న ఆ ఏడేళ్ళ బిజినెస్ బుడ్డోడిని అడిగితే రోెజుకు రెండు వేలు సంపాదిస్తున్నాను అని అమాయకంగా చెప్పాడు. పండగలప్పుడు, స్పెషల్ డేస్‌లో అది ఇంకాస్త ఎక్కువ ఉంటుంది. అంటే నెల మొత్తం అటూ ఇటూగా 70వేలు సంపాదిస్తున్నాడన్నమాట. తన చుట్టూ ఉన్న చాలా మందిని మనవాడే ఇప్పుడు పోషిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి. ఈ చిరుత పులి లాంటి పిల్లాడి నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు లేవా? అన్నీ ఉన్నప్పటికీ ఏవో చిన్న కారణాలతో ఎప్పుడు ఎలా చచ్చిపోదామా అని ఆలోచించేవాళ్ళందరికీ వీడికి మించిన గురువు ఎక్కడ దొరుకుతాడు?

https://youtu.be/QGiBMzADtBI

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news