Newsఆ స్టార్ హీరోని మాటలతో చితక్కొట్టేసిన పోసాని!!

ఆ స్టార్ హీరోని మాటలతో చితక్కొట్టేసిన పోసాని!!

తెలుగు సినిమా పీపుల్ అందరిలోకి పోసాని కృష్ణమురళి చాలా డిఫరెంట్. తనకు ఏదనిపిస్తే అని మాట్లాడేస్తూ ఉంటాడు. లోపలొకిటి, బయటికొకటి అన్న ప్రశ్నే ఉండదు. కోపం వస్తే ఎంత పెద్ద వాళ్ళనైనా సరే తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేస్తూ ఉంటాడు. తెలుుగ సినిమా ఇండస్ట్రీలో ఉన్న బోలెడంత మంది పెద్దలు కూడా పోసాని బాధితులే. ఏ మాటకామాట….మనవాడు చాలా సార్లు నిజాలే మాట్లాడతాడు.

ఇప్పుడు మరోసారి ఓ స్టార్ హీరోపైన విరుచుకుపడ్డాడు పోసాని. ఏకంగా ఆ స్టార్ హీరోని తీవ్రవాది అనేశాడు. ఆ హీరోకి మించిన తీవ్రవాది ఇంకెవరూ ఉండరని అభిప్రాయపడ్డాడు. అయితే మనవాడు తిట్టింది మాత్రం తెలుగు స్టార్ హీరోని కాదు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌ని. ఉగ్రవాదుల దాడిలో భారతీయ ప్రజలు, సైనికులు చినపోతే స్పందించలేదు కానీ పాకిస్తాన్ నటులపైన సానుభూతి చూపించడం ఏంటి అన్న పోసాని……సల్మాన్ ఖాన్ కంటే పెద్ద ఉగ్రవాది ఇంకెవరూ ఉండరని ఆవేశంగా మాట్లాడేశాడు. ఒక్క పోసాని అనే కాదు చాలా మంది మేధావులు కూడా సల్మాన్ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news