Moviesవిజ‌య్ పెళ్లి… స‌మంత కామెంట్‌పై ఇండ‌స్ట్రీలో ఒక్క‌టే చ‌ర్చ‌..!

విజ‌య్ పెళ్లి… స‌మంత కామెంట్‌పై ఇండ‌స్ట్రీలో ఒక్క‌టే చ‌ర్చ‌..!

విజయ్ దేవరకొండ – సమంత కలిసి జంటగా నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ 1న‌ థియేటర్లలోకి రాబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ జంట ప్రమోషన్ కూడా మొదలుపెట్టింది. ఇందులో భాగంగా విజయ్ దేవరకొండకు చెందిన కొన్ని ఆసక్తికర విషయాలని సమంత ప్రమోషన్లలో బయటపెట్టేస్తుంది. ఇవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ పెళ్లి గురించి సమంత రియాక్ట్ అవటం ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటోంది.

కొద్ది రోజుల నుంచి సమంత – విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారని.. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు అన్న పుకార్లు అయితే బయలుదేరాయి. ఎప్పుడు అయితే ఖుషి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో సమంత – విజయ్ దేవరకొండ స్టేజ్ మీద లైవ్ ప్రోగ్రాంలో రెచ్చిపోయి రొమాన్స్ చేశారో.. సమంత అయితే విజయ్ ఒడిలో వాలిపోయి.. విజయ్ చేతుల్లో గిరగిరా తిరిగిందో.. చివరలో హగ్గు కూడా ఇచ్చుకున్నారో చాలా మందిని వీరి రొమాన్స్ ఆక‌ట్టుకుంది. అలాగే పెద్ద చ‌ర్చకు కూడా దారితీసింది

అంతకు ముందు నుంచే వీరి మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తుందన్న పుకార్లు ఉన్నాయి. ఇక ఈవెంట్ తర్వాత ఇవి మరింత ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో సమంత.. విజయ్ దేవరకొండ పెళ్లిపై మాట్లాడటం సహజంగానే ఆసక్తిగా మారింది. విజయ్ పెళ్లి గురించి సమంత మాట్లాడుతూ విజయ్ రెండు మూడు ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటానని.. పైకి చెబుతున్న అతడు కచ్చితంగా ఈ ఏడాదిలోని పెళ్లి చేసుకుంటాడని షాకింగ్ న్యూస్ చెప్పింది.

సమంత చెప్పిన ఈ మాట‌లపై విజయ్ కూడా రిప్లై ఇచ్చాడు. కొన్ని ప్రాక్టికల్ కారణాల వల్ల తనకు పెళ్లిపై మంచి ఒపీనియన్ కలిగిందని చెప్పాడు. ఇప్పటికే వీరిద్దరిపై ఉన్న రూమర్లకు తోడు తాజాగా వీరిద్దరూ పెళ్లి గురించి ఒకే సందర్భంలో రియాక్ట్ అవ్వడం.. అందులోనూ విజయ్ పెళ్లి గురించి సమంత ఇంత ఓపెన్ గా మాట్లాడడంతో రకరకాల పుకార్లు మొదలయ్యాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news