మెగా హీరో వరుణ్ తేజ్‌కు ప్రయోగాలు చేయడం, కొత్త కొత్త జానర్లను ఎంచుకోవడం అలవాటు. తన కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేశాడు. ఇక దర్శకుడు ప్రవీణ్ సత్తారు సైతం అదే టైపులో సినిమాలు తెరకెక్కిస్తూ ఉంటాడు. ప్రవీణ్ సత్తార్ ముందు నుంచి వైవిధ్యమైన సినిమాలు ప్రజెంట్ చేస్తుంటాడు. ప్రవీణ్ సత్తార్ హై అండ్ స్టైలిష్ యాక్షన్ సినిమాలు తీయటంలో ముందు నుంచి స్పెషలిస్ట్ అయ్యారు.
రాజశేఖర్‌తో ఆయన తెరకెక్కించిన గరుడవేగ సినిమా చూసి టాలీవుడ్ ఒక్కసారిగా షాక్ అయింది. ఇప్పుడు అదే స్టైల్ లో వరుణ్ తేజ్ హీరోగా గాండీవధారి అర్జున సినిమా తీశారు. ఈ సినిమా మీద రిలీజ్ కి ముందు ఒక మోస్తరుగా బజ్ ఉంది. ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాపై ప్రీమియర్ రిపోర్టులు బయటకు వచ్చాయి. సినిమా ప్రయత్నం మంచిదే అయినా విఫలమైందని చాలామంది కామెంట్ చేస్తున్నారు.
ఇక బిలో యావరేజ్ మూవీ అని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. పాయింట్ చాలా బాగున్నా వెండితెరపై సరిగ్గా చూపించలేకపోయారని మరొకరు… రాడ్డు సినిమా పారిపోండ్రా బాబోయ్ అని ఇలా రకరకాల ట్విట్టర్లో టాక్ కనిపిస్తోంది. ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ మెసేజ్ బాగుంది.. మదర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది.. అయితే సినిమా ఫస్ట్ అఫ్ చాలా స్లోగా నడిపాడని ఒక నెటిజన్ ట్విట్ చేశాడు.
ఏది ఏమైనా ఓవరాల్ గా ఈ సినిమా మీద నెగిటివ్ కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి పూర్తి రివ్యూ వస్తే గాని ఈ సినిమా పరిస్థితి ఏంటి ? అన్నది చెప్పలేం. అసలు ఈ వీకెండ్ లో మంచి పోటీ ఉంది. ఆల్రెడీ దుల్కర్ సల్మాన్ కింగ్ ఆఫ్ కొత్త జస్ట్ ఓకే మూవీ.. బెదురులంక నవ్విస్తోంది.. బాయ్స్ హాస్టల్‌కు కుర్రాళ్లు ఎగబడతారు.. ఇలాంటి టఫ్ కాంపిటీషన్‌లో అర్జునుడు ఏం చేస్తాడు ?అన్నది ఈ రోజు సాయంత్రానికి తేలిపోనుంది.