Movies‘ భగవంత్ కేసరి ’ ఫ్యాన్స్‌ను సెప్టెంబ‌ర్ 1న అస్స‌లు ఆప‌లేం.....

‘ భగవంత్ కేసరి ’ ఫ్యాన్స్‌ను సెప్టెంబ‌ర్ 1న అస్స‌లు ఆప‌లేం.. నంద‌మూరి ర‌చ్చ రంబోలా..!

నట‌సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా.. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా.. క్రేజీ హీరోయిన్ శ్రీలీల కీలక పాత్రలో.. యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ మాస్ సినిమా భగవంత్‌ కేసరి. ఇటు అఖండ – వీరసింహారెడ్డి లాంటి రెండు సూపర్ డూపర్ హిట్ సినిమాల‌ తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా కావటం.. అటు ఆరు సూపర్ డూపర్ హిట్ల తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్ చేస్తున్న సినిమా కావడంతో భగవంత్‌ కేసరిపై మామూలు అంచనాలు లేవు.

ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ పోస్టర్లు సినిమాపై మంచి అంచనాలు పెంచేసాయి. సైన్ స్క్రీన్ బ్యానర్ పై హరీష్ పెద్ది – సాహు గార‌పాటి సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రు. 80 కోట్లకు పైగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కొద్ది రోజుల క్రితం రిలీజ్ అయిన టీజర్ అయితే యూట్యూబ్ ను షేక్ చేస్తుంది.

ఇక ఈ సినిమాపై ఉన్న హైప్‌ మరింత పెంచేలా సెప్టెంబర్ 1న నందమూరి అభిమానుల కోసం అదిరిపోయే అప్డేట్ ఇస్తున్నారు. ఆరోజు ఈ సినిమా నుంచి గణేష్ అంథం ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా మేకర్స్ ఒక పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఈ సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ తో పాటు బాలకృష్ణ అభిమానులకు పిచ్చపిచ్చగా నచ్చేలా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించినట్టు ట్రేడ్ వర్గాలు ధీమాతో ఉన్నాయి.

దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు రానుంది. కచ్చితంగా బాలయ్యకు చాలా రోజుల తర్వాత హ్యాట్రిక్ హిట్ సినిమాగా రికార్డుల్లో నిలుస్తుందని అందరూ ధీమాతో ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news