MoviesTL రివ్యూ: బెదురులంక 2012 - భ‌య‌పెడుతూ న‌వ్వించింది

TL రివ్యూ: బెదురులంక 2012 – భ‌య‌పెడుతూ న‌వ్వించింది

టైటిట్‌: ‘ బెదురులంక 2012 ‘
నటీనటులు : కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి, అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ‘ఆటో’ రాంప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, ‘స్వామి రారా’ సత్య, ‘వెన్నెల’ కిశోర్ తదితరులు
ఛాయాగ్రహణం : సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి
సంగీతం : మణిశర్మ
సమర్పణ : సి. యువరాజు
నిర్మాత : రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని
రచన, దర్శకత్వం : క్లాక్స్
విడుదల తేదీ: ఆగస్టు 25, 2023

యంగ్ హీరో కార్తీకేయ‌, నేహాశెట్టి జంట‌గా న‌టించిన బెదురులంక 2012 సినిమా ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. క్లాక్స్ ద‌ర్శ‌కత్వం వ‌హించిన ఈ సినిమాపై టీజ‌ర్‌, ట్రైల‌ర్ల త‌ర్వాత అంచ‌నాలు పెరిగాయి. మ‌రి ఈ సినిమా ఎలా ఉందో స‌మీక్ష‌లో చూద్దాం.

క‌థ‌:
ఈ సినిమా కథ అంతా 2012 కాలంలో సాగుతుంది. బెదురులంక గ్రామానికి చెందిన శివ ( కార్తికేయ) తన మనసుకు నచ్చినట్టు జీవిస్తాడు. హైదరాబాదులో ఉద్యోగం మానేసి సొంత ఊరు బెదురులంకకు వస్తాడు. అయితే అప్పటికే అక్కడ యుగాంతం రాబోతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంటుంది. టీవీలలో వస్తున్న వార్తలను చూసి భూషణం ( అజయ్ ఘోష్‌) ఊరి జనాలను మోసం చేయాలని పెద్ద ప్లాన్ వేస్తాడు. ఈ క్రమంలోనే ఆ ఊర్లో దొంగ జాతకాలు చెప్పే బ్రాహ్మణుడు బ్రహ్మ‌ణుడు ( శ్రీకాంత్ అయ్యంగార్ ) – చర్చి ఫాదర్ కొడుకు డేనియల్ ( ఆటో రాంప్రసాద్ ) తో కలిసి నిజంగానే యుగాంతం రాబోతుందని ఊరు ప్రజలను నమ్మిస్తాడు. యుగాంతని ఆపాలంటే అందరి ఇళ్లల్లో ఉన్న బంగారాన్ని తీసుకువచ్చి దాంతో శివలింగాన్ని, శిలువను తయారుచేసి గంగలో వదిలేస్తే యుగాంతం ఆగిపోతుంది అని చెబుతారు. ప్రెసిడెంట్ ( గోపరాజు రమణ) ఆదేశంతో ఊరి ప్రజలంతా తమ వద్దన్న బంగారాన్ని ఇచ్చేస్తారు. కానీ శివ మాత్రం పథకం మూఢనమ్మకం అని కొట్టి పారేస్తాడు. దీంతో ప్రెసిడెంట్‌ శివ‌ని ఊరు నుంచి వెలేస్తాడు.. ఆ తర్వాత ఏం జరిగింది ? ఊరి ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాన్ని పోగొట్టేందుకు శివ ఏం చేశాడు ? భూషణం ప్లాన్ ఎలా ? బయటపెట్టాడు. ప్రెసిడెంట్ గారి అమ్మాయి చిత్ర నేహాశెట్టితో ప్రేమలో ఉన్న శివ చివరకు ఆమెను పెళ్లి చేసుకున్నాడా లేదా అన్నదే ఈ సినిమా కథ.

విశ్లేష‌ణ :
2012లో యుగాంతం రాబోతుందని భూమి నాశనం అయిపోతుందని బెదురులంక గ్రామంలో అందరూ భయపడిపోతూ ఉంటారు. అయితే మూఢ‌ విశ్వాసాల కారణంగా జనాలు ఎలా ? మోసపోతున్నారు అనేది ఈ సినిమాతో కామెడీగా చూపించాడు. దర్శకుడు ప్రజల అమాయకత్వానికి, భయానికి మతం రంగు పులిమి కొందరు లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని.. ఇలాంటివి పట్టించుకోవద్దని దర్శకుడు సందేశం ఇచ్చాడు. యుగాంతం కాన్సెప్ట్ తో గతంలో హాలీవుడ్లో చాలా సినిమాలు వచ్చాయి. ఇండియాలోనూ పలు భాషలలో ఈ తరహా సినిమాలు వచ్చినా బెదురులంక సినిమాలో పాయింట్ చాలా కొత్తగా ఉంది.

తొలి సన్నివేశంలోనే శివ క్యారెక్టర్ ఎలా ? ఉండబోతుందో చూపించారు. తర్వాత కథ‌ అంతా బెదురులంక గ్రామం చుట్టూ తిరుగుతుంది. ప్రెసిడెంట్ గారి అమాయకత్వాన్ని వాడుకుని భూషణం చేయించే మోసాలు నవ్వులు పూయిస్తాయి. మధ్యలో హీరో, హీరోయిన్ల ప్రేమ కథ ఉన్న అది అంతగా ఆకట్టుకోదు. అసలు కథ ప్రారంభించడానికి కాస్త సమయం తీసుకున్న దక్షకుడు ఫస్ట్ ఆఫ్ మొత్తం సోసోగా నడిపించాడు. అసలు కథ సెకండాఫ్ లో ప్రారంభమవుతుంది.

ఊరి ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాన్ని పోగొట్టేందుకు శివ చేసే పనులు థియేటర్లలో నవ్వులు పూయిస్తాయి. సత్య, వెన్నెల కిషోర్ పాత్రల ఎంట్రీ తర్వాత కథ‌ ఆసక్తిగా ముందుకు సాగుతుంది. ఇక క్లైమాక్స్ సీన్ కు ప్రేక్షకులు పగలబడి నవ్వుతారు. కొన్ని చోట్ల డబుల్ మీనింగ్ డైలాగులు ఉన్నా అవి కూడా నవ్విస్తాయి. ఓవరాల్గా నవ్విస్తూనే మంచి సందేశం ఇచ్చిన సినిమా బెదురులంక.

ఎలాంటి పాత్రలో అయినా జీవించేస్తాడు హీరో కార్తికేయ. ఈ సినిమాలో తెరపై చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తాడు. తనకు నచ్చినట్టుగా జీవించే యువకుడు పాత్ర లో కార్తికేయ నూటికి నూరు శాతం న్యాయం చేశాడు. కామెడీతో పాటు యాక్షన్ సీన్ల‌లో అదరగొట్టేసాడు. నేహా శెట్టి పాత్ర నిడివి తక్కువే అయినా తనదైన అందచందాలతో ప్రేక్షకులను ఎంటర్ టైన్‌ చేసింది. జనాలను మోసం చేసి డబ్బులు సంపాదించాలని ఆశ ఉన్న భూషణం పాత్రలో అజయ్ ఒదిగిపోయాడు.

మిగిలిన పాత్రలు కూడా తమ పరిధి మేర‌ నటించారు. టెక్నికల్గా మణిశర్మ సంగీతం జస్ట్ ఓకే.. పాటలు ఆకట్టుకోలేదు కానీ నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ పనితీరు బాగుంది. ఎడిటర్ సినిమాను చాలా షార్ప్ గా కట్ చేశాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్టుగా ఉన్నాయి. దర్శకుడు ఓ మంచి సందేశం ఇస్తూనే కామెడీతో సినిమాను నీటుగా ప్రజెంట్ చేశాడు.

ఫైన‌ల్ పంచ్‌: భ‌య‌పెడుతూ న‌వ్వించే బెదురులంక 2012

బెదురులంక 2012 రేటింగ్‌: 2.75 / 5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news