Moviesఎన్టీఆర్ చనిపోయే కొన్ని గంటల ముందు.. ఆ స్టార్ హీరోకు ఫోన్...

ఎన్టీఆర్ చనిపోయే కొన్ని గంటల ముందు.. ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏమని చెప్పారో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఎన్ని కుటుంబాలు ఉన్నా నందమూరి అనే పేరు వినగానే తెలియని గూస్ బంప్స్ వస్తాయి. మనకు తెలియకుండానే మనం చేతులెత్తి నమస్కరించాలి అనే ఫీలింగ్ కలుగుతుంది . అలాంటి ఒక క్రేజి స్థానాన్ని సంపాదించుకున్నారు నందమూరి కుటుంబ సభ్యులు. కాగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే . మామూలు వ్యక్తిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ఓ స్టార్ హీరోగా ఎదిగి .. అంతే కాకుండా తన పేరు చెప్పుకొని నలుగురు ఇండస్ట్రీలోకి వచ్చేలా చేసుకున్నారు .

కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు రాజకీయాలలోనూ తనదైన స్టైల్ లో మెప్పించే సీఎం అయ్యి ప్రజలకు సేవ చేసి మెప్పించిన ఎన్టీఆర్ గురించి మనం ఎంత చెప్పకున్నా అది తక్కువగానే ఉంటుంది . అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ప్రథమ స్థానం ఉంది అని చెప్పక తప్పదు. కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ మరణానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వైరల్ గా మారింది. ఎన్టీఆర్ చనిపోయే కొన్ని గంటల ముందు ఆయన ప్రాణ స్నేహితుడు అక్కినేని నాగేశ్వరరావు గారికి ఫోన్ చేసి మరి ఓ విషయాన్ని చెప్పారట.

అదే విషయాన్ని ఓ ఇంటర్వ్యులో పాల్గొన్న రచయిత కృష్ణకుమారి వివరించారు . నందమూరి తారక రామారావు గారు అక్కినేని నాగేశ్వరావు గారు మంచి మిత్రులు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కొంతమంది ఇండస్ట్రీ వ్యక్తుల కారణంగా వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయట . ఆ తర్వాత మళ్లీ వీళ్ళ మధ్య అంతటి మంచి సాన్నిహిత్యం ఏర్పడలేక పోయిందట . అయితే నాగేశ్వరరావు గారికి ఎన్టీఆర్ ఒకరోజు కాల్ చేసి ఇంటికి రమ్మన్నారట . “నీతో భోజనం చేయాలని ఉంది ..నీతో కొంచెం మాట్లాడాలి ..ఇంటికి రా “అంటూ ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పిలిచారట.

“నాగేశ్వరరావు గారు సరే వస్తానంటూ రిప్లై ఇచ్చారట . అయితే అక్కడే నాగేశ్వరరావు గారు ఇంటికి వెళ్లే సమయంలోనే ఎన్టీఆర్ మరణించాతన్న వార్త వినిపించింది. దీంతో అక్కినేని నాగేశ్వరరావు గారి దిగ్భ్రాంతికి గురయ్యారట . అయితే ఎన్టీఆర్ – నాగేశ్వరరావుకి కాల్ చేసింది.. మనసారా క్షమాపణలు కోరడానికి అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. ” కొందరు వ్యక్తుల కారణంగా మన మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి ..దానికి మనమిద్దరం బాధపడ్డాం.. నా నుంచి తప్పుంటే క్షమించు అని చెప్పడానికే నాగేశ్వరరావు గారిని ఇంటికి పిలిపించాలి అనుకున్నారట. అయితే అప్పటికే ఆయన మరణించారు. ఈ విషయాన్ని ఆయన పర్సనల్ డైరీలో రాసి ఉంచారట..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news