బిగ్బాస్ రియాలిటీ షో ద్వారా పాపులర్ అయిన నటుడు సయ్యద్ సోహైల్. బిగ్ బాస్ హౌస్ లో ఎంత రచ్చ చేశాడో హౌస్ నుంచి బయటికి వచ్చాక అంత పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం హీరోగా వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఒక కొత్త ప్రయోగంతో మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా ద్వారా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొత్త డైరెక్టర్ శ్రీనివాస్ వింజనంపాటి తెరకెక్కించిన ఈ సినిమాలో రూపా కొడువాయార్ హీరోయిన్ గా నటించింది.
ఇప్పటికే పలుచోట్ల ప్రీమియర్ షోలు కూడా కంప్లీట్ అయ్యాయి. మిస్టర్ ప్రెగ్నెంట్ కథ విషయానికి వస్తే హీరో అమ్మానాన్న చిన్నతనంలోనే చనిపోవడంతో హీరో ఒంటరిగా పెరుగుతాడు. ఈ క్రమంలోనే ప్రేమిస్తున్నాను అని హీరోయిన్ అతడి జీవితంలోకి ఎంటర్ అవుతుంది.. ప్రెగ్నెన్సీ వల్లే అమ్మ చనిపోయిందని పిల్లల వద్దంటేనే పెళ్లి చేసుకుంటాను అని కండీషన్ పెడతాడు.
ఈ కండీషన్కు హీరోయిన్ ఓకే చెప్పడంతో ఒకటవుతారు. కానీ పెళ్లి తర్వాత హీరోయిన్ కి ప్రెగ్నెన్సీ రావడంతో మొదట ఆమెను పిచ్చ తిట్లు తిట్టి తర్వాత ఏం చేయాలో తెలియక తాను ఆ ప్రెగ్నెన్సీ తీసుకుంటాడు. హీరో ప్రెగ్నెంట్గా మారిన తర్వాత ఎలాంటి ? సమస్యలు ఎదుర్కొన్నాడు అన్నదే ఈ సినిమా కథ. సినిమా మొదటి అరగంట పాత్రలు పరిచయం చేయటం కోసం కాస్త సాగదీసినట్లుగా ఉంటుంది.
అదే సినిమాకు మైనస్ అని నెటిజెన్లు అంటున్నారు. ఇంటర్వెల్ ముందు నుంచి సినిమా చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఇక చివరి 40 నిమిషాలు అమ్మ గొప్పతనంతో పాటు.. కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు.. ప్రెగ్నెన్సీ మహిళల కష్టాలు చూపించి ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టించారు. ఓవరాల్గా సినిమా ప్రేక్షకులను మెప్పించినట్టు ఉంది. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని చెబుతున్నారు.