Moviesమ‌ద్యం మ‌త్తులో ఉండ‌గానే సిల్క్‌స్మిత ఆస్తులు కొట్టేసింది ఎవ‌రు…!

మ‌ద్యం మ‌త్తులో ఉండ‌గానే సిల్క్‌స్మిత ఆస్తులు కొట్టేసింది ఎవ‌రు…!

సిల్క్ స్మిత మూడు నాలుగు దశాబ్దాల క్రితం టాలీవుడ్ లో ఒక మెరుపు కలల అందాల సుందరి. అసలు సిల్క్ మత్తెక్కించే కళ్ళు చూస్తే చాలు.. అప్పట్లో యువత ఫిదా అయిపోయేవారు. ఎలాంటి గొప్ప మగాడు అయినా ఆమె అందానికి పడిపోవాల్సిందే. ఎక్కడో పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు సమీపంలోని కొవ్వలిలో పుట్టిన సిల్క్ స్మిత సినిమాలపై ఆసక్తితో మద్రాసులో అడుగు పెట్టింది. అక్కడ సీనియర్ హీరోయిన్ అపర్ణ ఇంట్లో పనిమనిషిగా చేరి అక్కడ నుంచి ఒక తమిళ సినిమాలో వేశ్య‌ పాత్రతో మొదటిసారిగా వెండితెరపై కనిపించింది.

అక్కడ నుంచి ఐటెం సాంగ్ లతో ఆడి పాడి సౌత్ సినీ ఇండస్ట్రీని తన అందచందాలతో షేక్ చేసి పడేసింది. అతి తక్కువ సమయంలోనే ఊహించని పాపులారిటీతో పాటు ఎన్నో ఆస్తులు కూడా పెట్టింది. అప్పట్లో స్టార్ హీరోలు సైతం తమ సినిమాలకు అదనకు క్రేజ్.. అదనపు మార్కెట్ కోసం సిల్క్ స్మితతో స్పెషల్ ఐటమ్ సాంగ్లు పెట్టించేవారు. చివరకు నవయుగ లాంటి పేరు ఉన్న డిస్ట్రిబ్యూటర్లు సైతం స్టార్ హీరోల సినిమాలకు కూడా మార్కెట్ జరిగేందుకు సిల్క్ స్మితతో ఐటమ్ సాంగ్ ఉండాలని పట్టుకొట్టేవారట. అంత గొప్ప స్టార్ డం సిల్క్ స్మితకు వచ్చింది.

ఇబ్బ‌డి ముబ్బిడిగా వచ్చిన క్రేజ్‌తో పాటు ఎన్నో ఆస్తులు రావడంతో ఆమె వ్యక్తిగత ప్రవర్తన గాడి తప్పిందని అంటారు. ఆమె మద్యానికి బాగా బానిస అయిపోయింది. దీనికి తోడు ఆమెను బాగా వాడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆమె తనకంటూ ఎవరూ లేకపోవడంతో తన ఆస్తిపాస్తులు చూసుకునేందుకు తన డేట్లు చూసుకునేందుకు డాక్టర్ రాధాకృష్ణ అనే వ్యక్తికి దగ్గర అయింది. ఈ క్రమంలోనే రాధాకృష్ణ ఆమెను బందీగా మార్చేశాడు.. పూర్తిగా కట్టడి చేశాడు.. తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. ఏ సినిమాలో నటించాలన్న రాధాకృష్ణ చెబితే కానీ సిల్క్ ఒకే చేయనంత కంట్రోల్ కు తెచ్చుకున్నాడు.

ఆమెతో సొంతంగా సినిమాలు కూడా తీయించాడు. ఒకటి రెండు సినిమాలు ఆడినా ఆ తర్వాత సినిమాలు ప్లాప్ అయ్యాయి. దీంతో భారీగా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్ల కోసం ఆమె తన ఆస్తులు అమ్మి డబ్బులు వెనక్కు కట్టింది. అప్పటికే ఆమె ఆర్థికంగా పతనమైంది. ఆమె మద్యం మ‌త్తులో ఉండగానే రాధాకృష్ణ సిల్క్ స్మితకు చెందిన చాలా ఆస్తులను తన పేరిట రాయించుకున్నాడు. చివరకు ఆమె ఎవరూ లేని అనాథ‌గా మారిపోయింది. తాను మోసపోయానన్న విషయం ఆలస్యంగా గ్రహించింది.

అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ క్రమంలోనే ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని అంటారు. అయితే ఆమె మృతిపై ఎప్పటికీ అనుమానాలు ఉన్నాయి. అది హత్య.. ఆత్మహత్య అన్నది క్లారిటీ లేదు. ఆమె సూసైడ్ నోట్లో కూడా కొన్ని కొట్టివేతలు ఉన్నాయని అంటారు. అది ఆమె స్వయంగా రాసిందా లేదా ఎవరైనా ? రాశారా అన్నదానిపై కూడా చాలా సందేహాలు ఉన్నాయి. ఏది ఏమైనా సిల్క్ స్మిత మృతి ఇప్పటికీ పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news