సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది బ్యూటీలు ఉన్నా.. అందాల ముద్దుగుమ్మ మలైకా అరోరా పేరు చెప్తే అందరికీ అదో తెలియని కిక్కు వస్తుంది అంటూ చెప్పుకొస్తూ ఉంటారు అభిమానులు . కాగా ఆల్రెడీ సల్మాన్ ఖాన్ బ్రదర్ ని పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చేసిన ఈ బ్యూటీ తనకంటే వయసులో చాలా చిన్నవాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తుంది . ఈ విషయాన్ని అఫీషియల్ గానే ఒప్పేసుకున్న ఇద్దరు ఎప్పటికప్పుడు తమ రొమాంటిక్ ఫొటోస్ ని షేర్ చేస్తూనే ఉంటారు. కాగా ఈసారి పూర్తిగా రెచ్చిపోయింది మలైకా అరోరా.
తన బాయ్ ఫ్రెండ్ బర్త్ డే సందర్భంగా ఫుల్ రెచ్చిపోయి డాన్స్ చేసింది . అయితే ఆ డాన్స్ వీడియోలో అమ్మడు వేసుకున్న డ్రెస్ చాలా అట్రాక్టివ్ గా ఉండడంతో ఆ డ్రెస్సు ఏంటా..? అసలు ఖరీదు ఎంత అభిమానం చర్చించుకుంటున్నారు . రీసెంట్గా అర్జున్ కపూర్ తన బర్త డే ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు . ఈ క్రమంలోనే పార్టీలో ఎంజాయ్ చేస్తూ దానికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది .
ఆ వీడియోలో మలైక డ్రెస్ చాలా ట్రెండిగా స్టైలిష్ గా ఉంది . అందుతున్న సమాచారం ప్రకారం ..ఆ డ్రెస్ ని ‘స్పానిష్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ లోవే’ నుంచి వచ్చినది. ఆ డ్రెస్ ని ఆంథూరియం ట్యాంక్ డ్రెస్ అని పిలుస్తారట. దీని ఖరీదు లక్ష రూపాయలు అంటూ తెలుస్తుంది . అంతేకాదు బాయ్ ఫ్రెండ్ బర్త్ డే కి మలైకా అరోరా చాలా ఎక్స్ పెన్సివ్ గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తుంది . ప్లాటినం బ్రేస్ లైట్ ని గిఫ్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఆ బ్రేస్లెట్ పై అర్జున్ మలైకాల పేర్లు డిజైన్ చేయించినట్లు బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . అంతేకాదు ఘటైన ముద్దుతో తనకి సర్ప్రైజ్ గా ఈ గిఫ్ట్ ని ప్రజెంట్ చేసినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ముసలి ఏజ్ లోను మలైకా అరోరా చాలా రొమాంటిక్గా తయారైపోయింది . ముద్దులతో ముంచెత్తుతూ ఇలాంటి బర్తడేలు మరెన్నో జరుపుకోవాలని విష్ చేసింది..!!