టాలీవుడ్ స్టార్ హీరోస్ గా పాపులారిటీ సంపాదించుకున్న చరణ్ – తారక్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా ఆర్ఆర్ఆర్ . రణం రౌద్రం రుధిరం అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా గ్లోబల్ స్థాయిలో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ చేసుకోవడమే.. కాకుండా కోట్లాదిమంది ఇండియన్స్ ఎప్పుడు ఎప్పుడు అంటూ ఎదురు చూసిన ఫస్ట్ ఆస్కార్ ని ఇండియాకి తీసుకొచ్చింది.
మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రపంచ వ్యాప్తంగా ఆఅదర కొట్టిన ఈ సినిమా ఆడియన్స్ ని బాగా మెప్పించింది . అంతేకాదు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి ఫస్ట్ ఆస్కార్ తీసుకువచ్చిన సినిమాగా రికార్డు నెలకొల్పింది . అయితే ఇప్పుడు మరో క్రేజీ రికార్డుని తన ఖాతాలో వేసుకుంది ఆర్ఆరార్ . ఈ ఏడాది మార్చిలో అకాడమీ నుంచి నాటు నాటు పాటతో ఒరిజినల్ స్కోర్ విభాగంలో అవార్డు దక్కిన విషయం తెలిసిందే.
కాగా ఇప్పుడు మరోసారి భారతీయ సినీ ప్రేక్షకులు గర్వించే క్షణం ఆర్ఆరార్ తో వరించింది. తాజాగా ఆస్కార్ కమిటీ నుంచి ఆహ్వానం అందుకుంది. ఆరారార్ ఆస్కార్ గెలుచుకోవడమే కాకుండా అకాడమీ జ్యూరీ మెంబర్స్ గా కూడా సెలెక్ట్ అయ్యారు మన హీరోలు. తాజాగా సెలెక్ట్ అయిన వారిలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ -సాబు సీరిల్ -కీరవాణి -చంద్రబోస్ కూడా ఉన్నారు .
అయితే సినిమాని డైరెక్ట్ చేసిన రాజమౌళి అందులో లేకపోవడం అభిమానులకి డిసప్పాయింట్మెంట్ ఇచ్చింది. ఎంతో కృషి చేసిన జక్కన్న పేరు కూడా ఉండుంటే ఇంకా సంతోషించే వాళ్ళమంటూ చెప్పుకొస్తున్నారు ఫ్యాన్స్. కాగా కొత్తగా చేరిన మెంబర్స్ తో కలిపి ప్రపంచవ్యాప్తంగా అకాడమీ జ్యూరీ లిస్టులో 10817 మంది ఉన్నారు. 96 అకాడమీ అవార్డ్స్ లో మాత్రం 9375 మంది మాత్రమే ఓట్లు వేయబోతున్నారని తెలుస్తుంది..!!