Moviesతెలుగులో జాన్వీ చేయాల్సిన ఫస్ట్ సినిమా ఏంటో తెలుసా..? అన్ని మాట్లాడుకున్నాక...

తెలుగులో జాన్వీ చేయాల్సిన ఫస్ట్ సినిమా ఏంటో తెలుసా..? అన్ని మాట్లాడుకున్నాక క్యాన్సిల్..ఏమైందంటే..?

శ్రీదేవి ముద్దుల కూతురుగా పాపులారిటీ సంపాదించుకుని ఇండస్ట్రీలో తన స్టైల్ లో దూసుకుపోతున్న జాన్వీ కపూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అమ్మడు హవా ఎక్కువగా కొనసాగుతుంది . తెలుగులో ఆమె నటించిన ఒక్కటంటే ఒక్క సినిమా రిలీజ్ అవ్వనప్పటికీ మూడు సినిమాలకు సైన్ చేసి సంచలనాన్ని క్రియేట్ చేస్తుంది .

అయితే జాన్వి కపూర్ దేవర సినిమా కంటే ముందే తెలుగులో వేరే సినిమాతో ఎంట్రీ ఇవ్వాల్సి ఉందని .. తన మేనేజర్ చేసిన తప్పుడు నిర్ణయం కారణంగా.. ఈ అమ్మడు ఈ సినిమా నుంచి అవుట్ అయిందని తెలిసి జనాలు బాధపడిపోతున్నారు . ఇంతకీ ఆ సినిమా ఏంటా అనుకుంటున్నారా ..? అక్కినేని కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ దక్కించుకుంది. అఖిల్ కెరియర్ లోనే హిట్ అయిన సినిమాగా రికార్డు నమోదు చేసుకుంది . ఈ క్రమంలోనే మొదట డైరెక్టర్ ఈ సినిమాలో జాన్వికపూర్ ని హీరోయిన్ గా అనుకున్నారట. అయితే జాన్వికపూర్ కి కూడా ఈ కథ నచ్చగా ఓకే చేసిందట . కానీ ఆమె మేనేజర్ అఖిల్ ట్రాక్ రికార్డు చెప్పి జాన్విని భయపెట్టేసి ఈ సినిమా నుంచి తప్పుకునేలా చేసాడట. దీంతో పూజ హెగ్డే ఆ స్థానంలో కి వచ్చింది .. ఇలా జాన్వి కపూర్ మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news