ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో మెగాకోడలు ఉపాసన పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరి ముఖ్యంగా ఉపాసన గర్భం దాల్చింది అని తెలిసినప్పటి నుంచి ఆమెకు సంబంధించిన ప్రతి ఒక్క చిన్న విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. కాగా రీసెంట్ గానే ఉపాసన శ్రీమంతం చాలా సింపుల్ గా జరిపింది మెగా ఫ్యామిలీ. ఈ క్రమంలోనే మెగా కోడలు ఉపాసన ఫొటోస్ వైరల్ అయ్యాయి .
కాగ రీసెంట్గా మెగా కోడలు ఉపాసన తనకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అని తెలియగానే రామ్ చరణ్ ఏం చేశాడో అనే విషయాన్ని చెప్పి అభిమానులను సర్ప్రైజ్ చేసింది . మరి కొద్ది రోజుల్లోనే పండంటి పాపకి లేదా బాబుకి జన్మనివ్వబోతున్న ఉపాసన రాంచరణ్ కు తన ప్రెగ్నెన్సీ విషయం చెప్పగానే మొదట చరణ్ చాలా కూల్ గా రియాక్ట్ అయ్యారట . “చరణ్ నాకు ఎందుకు ప్రెగ్నెన్సీ వచ్చింది అని అనుమానంగా ఉంది..? అంటూ చెప్పగా చరణ్.. తొందరపడకు ..ఆవేశ పడకు పరీక్షలు చేద్దాం.. ఆ తర్వాత రిజల్ట్ తెలుస్తుంది ” అంటూ చాలా కూల్ గా ఆన్సర్ ఇచ్చారట.
అదే తనలో నాకు చాలా ఇష్టం అని .. నేను ఏ విషయంలో నైన తొందరపడతానని.. తను చాలా కూల్ అండ్ సైలెంట్ గా రియాక్ట్ అవుతాడు ..రిజల్ట్ చూపిస్తాడు అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఉపాసన కామెంట్స్ వైరల్ గా మారాయి. మెగా పవర్ స్టార్ రాంచరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ప్రస్తుతం నిండు గర్భంతో ఉన్నారు. త్వరలో కొణిదెల వారి ఇంట వారసుడో వారసురాలో రాబోతున్నారు. ఆ బ్యూటిఫుల్ మూమెంట్ కోసం మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులంతా ఎదురుచూస్తున్నారు.