ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సినీ స్టార్ సెలబ్రిటీస్ ఎలాంటి దుస్తులు ధరిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కోట్లకు కోట్లు ఆస్తులున్న ముద్దుగుమ్మలు సైతం చిట్టి పొట్టి బట్టలు వేసుకుని కుర్రాళ్లను టెంప్ట్ చేస్తున్నారు. అంతేకాదు పద్ధతిగా పెళ్లయి ఇద్దరేసి పిల్లలున్న కొందరు స్టార్ హీరోయిన్స్ కూడా విచ్చలవిడిగా అందాలు ఆరబోస్తున్నారు. ఇన్నర్ ధైస్ కనిపించేలా షాట్స్ .. ఎద భాగాలు కనిపించేలా టాప్స్ వేస్తూ కుర్రాళ్లకు హీట్ పెంచేస్తున్నారు.
అయితే వాళ్ళందరికీ భిన్నంగా వ్యవహరిస్తుంది టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత. పెళ్లికి ముందు సినీ ఇండస్ట్రీని తన అందచందాలతో షేక్ చేసిన నమ్రత పెళ్లి తర్వాత మాత్రం పూర్తిస్థాయి తెలుగింటి అమ్మాయిగా.. తెలుగింటి కోడలుగా నడుచుకుంటుంది . ఎక్కడ తన హద్దులు మీరకుండా తన భర్త గౌరవాన్ని సైతం ఇంక్రీస్ చేస్తుంది . అంతేకాదు రీసెంట్గా నమ్రత ఓ ప్రైవేట్ పార్టీ ఈవెంట్ కి వెళ్ళిన సంగతి తెలిసిందే .
ఈ వేడుకలకి మహేష్ బాబు ఫ్యామిలీ మొత్తం హాజరయ్యారు. ఈ క్రమంలోని సోషల్ మీడియాలో వాళ్ళ డ్రెస్ ల కి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ గా మారాయి . మరీ ముఖ్యంగా సితార పాప.. నమ్రత శిరోద్కర్ వేసుకున్న డ్రెస్ ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . చూడడానికి చాలా స్టైలిష్ గా ట్రెండీగా ఉన్నా.. అదే విధంగా ట్రెడిషనల్ గా ఉంది. దీంతో అభిమానులను ఆకట్టుకుంటుంది . అంతేకాదు నమ్రత వేసుకున్న డ్రెస్ కాస్ట్ 4 లక్షలు అంటూ తెలుస్తుంది . ఇది స్పెషల్ గా డిజైనర్ చేత డిజైన్ చేసిందట . పూర్తిగా సాఫ్ట్ క్లాత్ స్టిచ్ చేయించిన ఈ డ్రెస్ ఎంతో ఇష్టంగా డిజైన్ చేయించుకున్నట్లు ట్రెండ్ అవుతుంది . దీంతో ఈ డ్రెస్ పై హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి..!!