Moviesఅభిమానుల కోసం బాలయ్య స్పెషల్ సర్ ప్రైజ్.. పుట్టిన రోజు నాడు...

అభిమానుల కోసం బాలయ్య స్పెషల్ సర్ ప్రైజ్.. పుట్టిన రోజు నాడు అద్దిరిపోయే మరో కేకపెట్టించే న్యూస్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ నరసింహం గా పేరు సంపాదించుకున్న నందమూరి బాలయ్య మెగా డైరెక్టర్ తో మూవీకి ఫిక్స్ అయ్యారా ..? అంటే అవుననే అంటున్నారు సినీ ప్రముఖులు ..సినీ విశ్లేషకులు . వీరసింహారెడ్డి సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న బాలయ్య త్వరలోనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ ని రివీల్ చేయబోతున్నారు . బాలయ్య పుట్టినరోజు సందర్భంగా జూన్ 8న ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ని భారీ స్థాయిలో లాంచ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు .

ఏకంగా 108 కేంద్రాలలో 108 హోర్డింగ్స్ లో ఒకేసారి సినిమా టైటిల్ రివీల్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు . దీంట్లో సినిమాపై హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ నెలకొన్నాయి. అయితే ఇదే క్రమంలో బాలయ్య పుట్టినరోజున జూన్ 10న ఆయన తర్వాత డైరెక్షన్ లో నటించబోతున్న సినిమాల పై కూడా కీలక అప్డేట్స్ రాబోతున్నట్లు తెలుస్తుంది . మరి ముఖ్యంగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య మరో సినిమా చేస్తున్నాడు అన్న విషయం తెలిసిందే . అయితే దాంతో పాటు ఆల్టర్నేట్ గా మెగా డైరెక్టర్ తో కూడా బాలయ్య మూవీకి కమిట్ అయినట్లు తెలుస్తుంది .

ఆ డైరెక్టర్ ఎవరో కాదు రీసెంట్ గానే వాల్తేరు వీరయ్య సినిమాతో మెగాస్టార్ ఖాతాలో 100 కోట్లు సినిమాను వేసిన బాబీ. ఎస్ బాబీ దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమాకి కమిట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ఈ విషయాన్ని అనఫిషియల్ గా కన్ఫర్మ్ చేశాడు నిర్మాత నాగవంశీ . సితార ఎంటర్టైన్మెంట్స్ పై నాగవంశీ బాలయ్యతో ఓ సినిమాను నిర్మిస్తున్నారట . అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను డైరెక్ట్ చేయబోయేది బాబి అంటూ తెలుస్తుంది. వంద కోట్ల డైరెక్టర్ తో బాలయ్య సినిమా అంటే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే అంటున్నారు బాలయ్య అభిమానులు. చూద్దాం మరి ఈ సినిమా అప్డేట్ ఎలా ఇస్తారో ..? ఏ విధంగా మెప్పిస్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news