Moviesవామ్మో .."ఆది పురుష్" ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్ వేసుకున్న...

వామ్మో ..”ఆది పురుష్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్ వేసుకున్న షర్ట్ అన్ని లక్షలా..? గిఫ్ట్ చేసింది ఎవరో తెలుసా..?

టాలీవుడ్ స్టార్ హీరోగా పాపులర్టి సంపాదించుకున్న పాన్ ఇండియా హీరో ప్రభాస్ తాజాగా నటిస్తున్న సినిమా “ఆది పురుష్”. రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో గ్రాండ్గా జరిగింది . జూన్ 16 న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవల్ లో ధీయేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు అభిమానులు . మరీ ముఖ్యంగా రామాయణంలోని ఓ పర్వం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఖచ్చితంగా ఇండస్ట్రీలో టాప్ రికార్డులు నెలకొల్పబోతుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కోట్లు ఖర్చు చేసి సినీ ఇండస్ట్రీలో సంచలనాన్ని క్రియేట్ చేసిన ఆది పురుష ప్రీ రిలీజ్ ఈవెంట్ ..గ్రాండ్గా సక్సెస్ అయ్యింది. ఈ క్రమంలోనే ఈవెంట్ కి సంబంధించిన పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈవెంట్లో ప్రభాస్ వేసుకున్న డ్రెస్ ఇప్పుడు ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ షర్ట్ ఈ డ్రెస్ ప్రభాస్ కు ఓ వ్యక్తి గిఫ్ట్ చేశారట .

ఆ వ్యక్తి ఎవరో కాదు ..ఆది పురుష డైరెక్టర్ ఓం రావత్ . ఎస్ ఇదే విషయం ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో .. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అందుతున్న సమాచారం ప్రకారం ఈ కుర్తా ఖరీదు దాదాపు 10,00,000 పై మాటే అని తెలుస్తుంది. అంతేకాదు ఇది స్పెషల్ డిజైనర్స్ చేత ఓం రావత్ డిజైన్ చేయించి మరి ప్రభాస్ కోసం గిఫ్ట్ చేశారట . అందుకే ఆయన ఇష్టంగా ఇచ్చిన డ్రెస్ ని ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వేసుకున్నాడు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news