Movies"మా నాన్నకి నా సక్సెస్ కి అస్సలు సంబంధం లేదు..అది పెద్ద...

“మా నాన్నకి నా సక్సెస్ కి అస్సలు సంబంధం లేదు..అది పెద్ద బూతు”.. వరలక్ష్మి శరత్ కుమార్ కాంట్ర వర్షీయల్ కామెంట్స్ వైరల్..!!

టాలీవుడ్ – కోలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ఎంత చెప్పినా తక్కువే . కాగా ఇండస్ట్రీలో లేడీస్ విలన్ గా పనికిరారు అన్న అపోహను ఆమె తుడిచి పెట్టేసింది. విలన్ గా లేడీస్ కూడా నటించి మెప్పించగలరు అంటూ పలు సినిమాల్లో నటించి మెప్పించింది . మరీ ముఖ్యంగా గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో తెరకెక్కిన క్రాక్ సినిమాలో అమ్మడు విలన్ గా జయమ్మ పాత్రలో నటించి మెప్పించి సినిమా హిట్ కి ప్రధాన కారణమైంది .

ఇప్పటికి క్రాక్ సినిమా అంటే రవితేజ ఎంతలా గుర్తొస్తారో ..అంతే జయమ్మ పాత్ర గుర్తొస్తుంది. ఆ తర్వాత వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్యకు చెల్లెలుగా నటించి సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన వరలక్ష్మి శరత్ కుమార్ ప్రజెంట్ టాలీవుడ్ కోలీవుడ్ లో వరుస సినిమాలకు కమిట్ అయింది . అంతేకాదు రీసెంట్గా వరలక్ష్మీ శరత్ కుమార్ ఓంకార్ హోస్ట్ చేస్తున్న సిక్స్త్ సెన్స్ షో కి గెస్ట్ గా హాజరైంది . ఆమెతోపాటు ఆమె జాన్ జిగిడి దోస్త్ బిగ్ బాస్ ఓటిటి విన్నర్ బిందు మాధవి కూడా హాజరైంది .

ఈ క్రమంలోనే యాంకర్ సరదా సరదాగా వాళ్లతో గేమ్స్ ఆడించారు . అంతేకాదు వరలక్ష్మి శరత్ కుమార్ ని పెళ్లి పై ప్రశ్నించగా ఆమె షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది . పెళ్లి అనేది ఓ పెద్ద బూతు అంటూ దారుణమైన కామెంట్ చేసింది . అంతేకాదు పెళ్లి అనేది ఓ బూతు అనే పదంలో క్రాస్ ఫింగర్స్ చూపించింది. ” అంతేనా నా విజయానికి నా తండ్రికి ఎటువంటి సంబంధం లేదు ” అంటూ ఓపెన్ గానే చెప్పకు వచ్చింది . “నేను నటినవ్వడం నా నాన్నకి ఇష్టం లేదు..

ఈ విషయం ఆయనే ఓపెన్ గా చెప్పుకొచ్చాడు . ఇక మా అమ్మకి సినిమా ఇండస్ట్రీ తో ఎటువంటి సంబంధం లేదు. నా విజయం వెనక పూర్తిగా నేనే ఉన్నాను.. నా కష్టమే ఉంది. నా సక్సెస్ వెనక కారణం నేనే అంటూ బోల్డ్ గా కామెంట్ చేసింది “. అంతేకాదు పెళ్లి అవసరం కోసం కాదు ప్రేమతో చేసుకోవాలి ..మన లైఫ్ ని తీసుకెళ్లి వేరే వాళ్ళ చేతుల్లో పెట్టడం నాకు ఇష్టం లేదు . ప్రెసెంట్ నేను చాలా హ్యాపీగా సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేసుకుంటున్నాను . నా వరకు ఇది చాలు ” అంటూ బోల్డ్ గా స్పందించింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news