ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ రెండో పెళ్లి వార్త ట్రెండ్ అవుతుంది . టాలీవుడ్ యంగ్ హీరో గా పేరు సంపాదించుకున్న అడవి శేష్ తో అమ్మడు ఏడడుగులు వేయబోతుందని త్వరలోనే పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి నాగార్జున కూడా యాక్సెప్ట్ చేసినట్లు ఓ న్యూస్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అఫీషియల్ గా ఈ న్యూస్ ఎవరు అనౌన్స్ చేయకపోయినా బ్యాక్గ్రౌండ్ లో మాత్రం అక్కినేని ఇంటికి అల్లుడు కాబోతున్నాడు ఈ హీరో అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
అంతేకాదు గత కొంత కాలం గా సుప్రియ- అడవి శేష్ తో రిలేషన్ లో ఉన్నట్లు తెలుస్తుంది . దానికి తగ్గట్టే వీరిద్దరూ కొన్నిసార్లు చటాపటాలు వేసుకుని తిరుగుతూ మీడియా కంట కనపడ్డారు . ఒకే కారులో పక్క పక్కన కూర్చొని తిరగడం కూడా సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారు అన్న న్యూస్ వైరల్ గా మారింది. అయితే సుప్రియ అడవి శేషు కంటే ముందే మరో టాలీవుడ్ హీరోని ప్రేమించిందని.. ఆ హీరోని పెళ్లి చేసుకోవాలనుకునిందని ,, అయితే ఆ హీరో బడా ఫ్యామిలీ మెంబర్ కావడంతో ఆ ఆమ్మడిని రెండో పెళ్లి చేసుకుంటాడా..? లేదా..? అని ఆ ప్రేమ విషయాన్ని ఆమెలోనే దాచేసుకుందట .
దూరం నుంచి ఆ హీరోని చూస్తూ ప్రేమించి కాలం గడిపేసిందట. కానీ ఎక్కడ ఆ ప్రేమ విషయాన్ని బయటకు చెప్పలేదట . అంతేకాదు ఆ హీరోతో పని చేసే ఛాన్స్ వచ్చినా కూడా అమ్మడు రిజెక్ట్ చేసేసిందట. ఆ అబ్బాయికి పెళ్లయ్యేవరకు ఎంతో ఉత్సాహంగా ఆయన ప్రతి ఈవెంట్లో పాల్గొన్న సుప్రియ .. ఆయన పెళ్లి చేసుకున్న ముహూర్తం నుంచి అతగాడికి దూరంగా ఉంటుందట . ఆ తర్వాతే అడవి శేష్ కు దగ్గర అయినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో సోషల్ మీడియాలో అడవి శేషు కన్నా ముందే సుప్రియ మరో హీరో ని ప్రేమించిందని.. పెళ్లి చేసుకోవాలనుకునింది అన్న న్యూస్ వైరల్ అవుతుంది. ఆశ్చర్యం ఏంటంటే ఆ హీరో కూడా టాలీవుడ్ బడా ఫ్యామిలీకి చెందిన అబ్బాయి కావడం గమనార్హం..!!