Movies"ఆదిపురుష్" ప్రీ రిలీజ్ ఈవెంట్ : పెళ్లి పై బిగ్ అప్డేట్...

“ఆదిపురుష్” ప్రీ రిలీజ్ ఈవెంట్ : పెళ్లి పై బిగ్ అప్డేట్ ఇచ్చైన ప్రభాస్..డార్లింగ్ ఫ్యాన్స్ కి పండగే..!!

టాలీవుడ్ రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న పాన్ ఇండియా హీరో ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం “ఆది పురుష్”. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి సనన్ సీతమ్మ దేవి పాత్రలో కనిపించబోతుంది . అంతేకాదు ఈ సినిమా జూన్ 16న గ్రాండ్గా థియేటర్స్ లో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోని సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిన్న తిరుపతిలో గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి గెస్ట్ గా వచ్చి తమ బ్లెస్సింగ్స్ ను ప్రభాస్ కి ఆదిపరుష్ టీం కి అందజేశారు . అయితే ఇదే టైంలో ప్రభాస్ స్పీచ్ ఇస్తున్న క్రమంలో డార్లింగ్ ఫాన్స్ అందరు పెళ్లెప్పుడన్నా పెళ్లెప్పుడు అంటూ కేకలు అరుపులతో రచ్చ రంబోలా చేశారు . ఈ క్రమంలోనే ప్రభాస్ సైతం తన పెళ్లి పై చిరునవ్వుతో స్పందించారు . “పెళ్ళే కదా చేసుకుంటాను.. తిరుపతిలోనే కచ్చితంగా చేసుకుంటాను ” అంటూ క్రేజీ హింట్ ఇచ్చారు.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ప్రభాస్ పెళ్లి వార్త మరోసారి వైరల్ గా మారింది . ప్రభాస్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అని అది కూడా తిరుపతిలోనే అని.. అందుకే అంత పక్కాగా చెప్పేసాడని ఓ న్యూస్ వైరల్ అవుతుంది . అయితే అమ్మాయి ఎవరు అనేది మాత్రం చెప్పలేదు. అనుష్క శెట్టినా..? లేకపోతే మరెవరైనా అమ్మాయి నా..? అది ప్రభాస్ చెప్తేనే బాగుంటుంది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news