సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న పూరి జగన్నాథ్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలింగ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్స్ అందరూ ఆయన దర్శకత్వంలో నటించాలి అని ..తెగ ఆత్రుత పడేవారు . సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆయన డైరెక్షన్ అంటేనే పరుగులు పెట్టేస్తున్నారు . అంతలా తన ఫేమ్ ను డి గ్రేట్ చేసుకున్నారు పూరి జగన్నాథ్.
కాగా ఈ మధ్యకాలంలో పూరి జగన్నాథ్ తెరకెక్కించి హిట్ అందుకున్న సినిమాలే లేవు . ఆయన లాస్ట్ గా హిట్ అందుకున్న సినిమా ఇస్మార్ట్ శంకర్ . రామ్ పోతినేని హీరోగా నబ్బా నటేష్ – నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 2019 జూలై 18న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్ ని సంపాదించుకున్నింది. తొలి అట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది ,
అయితే నిజానికి ఈ సినిమా అనుకున్నప్పుడు పూరీ జగన్నాథ్ మొదట అనుకున్న హీరో రామ్ పోతినేని కాదట . విజయ్ దేవరకొండ అంటూ తెలుస్తుంది. వరుస ప్లాపులతో సతమతమైపోతున్న పూరి జగన్నాథ్ ఈ కథను విజయ దేవరకొండ కోసం అనుకున్నారట . అయితే స్టోరీని వివరించగా ఫుల్ మాస్ లా ఉందని.. .. ఆ స్లాంగ్ .. ఆ మాస్ కట్స్ నా ఫేస్ కి సూట్ అవ్వవు” అంటూ విజయ్ దేవరకొండ ఈ కధను రిజెక్ట్ చేశారట . ఈ క్రమంలోనే ఈ పాత్ర రామ్ చేతికి వెళ్లి ఆయన కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలా మిస్ అయిన కాంబో ఆ తర్వాత లైగర్ తో మొదలుపెట్టి అట్టర్ ఫ్లాప్ గా మారింది..!!