టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంటున్న రెబల్ హీరో తర్వాతే ఎవరైనా అని అంటుంటారు రెబెల్ ఫాన్స్. దానికి కారణం బాహుబలి సినిమా అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలో ఆస్కార్ అవార్డు అందుకున్న ఆర్ఆర్ఆర్ సినిమా కంటే బాహుబలి సినిమానే లైక్ చేసే జనాలు ఎక్కువ మంది ఉన్నారు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .
కాగా ప్రభాస్ సినిమాల పరంగా ఫ్లాప్స్ అందుకుంటున్న సరే ఆయన క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు . ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ కి ఒక హీరోయిన్ అంటే ఇష్టమని ఆమెతోనే లిప్ లాక్ చేయడానికి ఇష్టపడతాడు అన్న వార్త వైరల్ గా మారింది . సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ ఎంతోమంది హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు .. రొమాంటిక్ సీన్స్ లో నటించారు . అయితే డైరెక్ట్ గా లిప్ లాక్ చేసింది మాత్రం అనుష్కతో అనే చెప్పాలి .
“బిల్లా” సినిమాలో వీళ్ళ రొమాన్స్ ఎంత ఘాటుగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆ టైంలో లిప్ లాక్ ఇచ్చుకునే స్థాయికి వెళ్లిన.. డైరెక్టుగా లిప్ లాక్ అయితే ఇవ్వలేదు. అయితే బాహుబలి లో మాత్రం ఆ కోరికను తీర్చేశాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఓరోరి రాజా సాంగ్లో అనుష్కతో ఘాటైన లిప్ లాక్ చేయించి సినిమాకి హైలైట్ గా సీన్స్ ని క్రియేట్ చేశారు . అంతేకాదు ప్రభాస్ కూడా మిగతా హీరోయిన్ తో లిప్ లాక్ అంటే భయపడతాడని.. అనుష్క తో కంపర్టబుల్ గా చేస్తాడు అని ఓ న్యూస్ వైరల్ అవుతుంది. రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ – పూజ హెగ్డే కి లిప్ లాక్ ఇవ్వమంటే ఇవ్వనంటూ మొండి చేశాడట . అయితే అనుష్క విషయంలో మాత్రం ప్రభాస్ ఇంత పాజిటివ్ గా ఉండడానికి కారణం వాళ్ళ మధ్య ఉన్న ఫ్రెండ్షిపే అంటూ తెలుస్తుంది..!!