Moviesమార్కెట్ లోకి మహేశ్ "గుంటూరు కారం" షర్ట్స్.. రేటు తెలిస్తే మైండ్...

మార్కెట్ లోకి మహేశ్ “గుంటూరు కారం” షర్ట్స్.. రేటు తెలిస్తే మైండ్ దొబ్బాల్సిందే..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సినిమా “గుంటూరు కారం”. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో ఎంతో భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై జనాల్లో హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రీసెంట్గా మహేష్ బాబు తండ్రి కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ అండ్ టైటిల్ని రివిల్ చేశారు .

సినిమాకి ఏవేవో టైటిల్స్ ప్రచారంలోకి వచ్చిన ..ఫైనల్ గా మాస్ టైటిల్ అయిన “గుంటూరు కారం” అనే టైటిల్ ని ఫిక్స్ చేసి త్రివిక్రమ్ సెంటిమెంట్ను బ్రేక్ చేశారు. మహేష్ బాబు ఎంత మాసివ్ మాస్ స్ట్రైక్ లుక్ లో కనిపించారు. గుంటూరు కారం లాగే చాలా ఘాటుగా కనిపించారు . ఈ సినిమాల్లో మహేష్ బాబు ఎరుపు రంగు చొక్కా ధరించి దానిపై నల్లటి గీతాలు ఉన్నాయి . అయితే ప్రస్తుతం మార్కెట్లో ఈ షర్ట్ సందడి చేస్తుంది . మహేష్ బాబు ఫ్యాన్స్ షర్ట్స్ ని కొనుగోలు చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు .

అయితే ఈ షర్ట్ ఖరీదు 3000 గా తెలుస్తుంది. సాధారణంగా ఒక హీరో ఏదైనా వాచ్ పెట్టుకున్న ..షర్ట్ వేసుకున్న అలాంటివే వేసుకోవాలని అభిమానులు ఆశపడుతూ ఉంటారు . దీంతో అలాంటి మైండ్ సెట్ చేసుకున్న ఈ కామర్స్ సంస్థలు మహేష్ “గుంటూరు కారం”ను వాడుకుంటున్నారు. అంతేకాదు కొందరు ఆయన ఒరిజినల్ ప్రోడక్ట్ ను డమ్మీలుగా చేసి షర్ట్స్ లు మార్కెట్ లో రిలీజ్ చేశారు. మహేష్ బాబు వేసుకున్న ఈ షర్ట్ ఇప్పుడు మార్కెట్లో కూడా లభించడంతో ఫ్యాన్స్ ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అయితే మహేష్ బాబు ఈ షర్ట్ కావాలనే వేసుకున్నారని ..ఆయన ఈ కామర్స్ సంస్థకు ప్రాఫిట్స్ తెప్పించేలా ఇలా డీల్ కుదుర్చుకొని ..సినిమాలో ప్రమోట్ చేస్తున్నారని కొందరు జనాలు చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news