ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా రెండే రెండు పేర్లు మారుమ్రోగిపోతున్నాయి . ఒకటి పవిత్రలోకేష్.. రెండు నరేష్. టాలీవుడ్ ఇండస్ట్రిలో స్పెషల్ క్రేజీ స్థానాన్ని దక్కించుకున్న ఈ ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామంటూ అనౌన్స్ కూడా చేసేసారు . “మళ్ళీ పెళ్లి ” సినిమా ద్వారా ఈ జంట అభిమానలను ఎంటర్టైన్ చేసిన విషయం తెలిసిందే. కథపరంగా కంటెంట్ పరంగా అంతా కూడా నరేష్ – పవిత్రల రియల్ లైఫ్ స్టోరీ కావడంతో .. అది ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సినిమా ఫ్లాప్ అయింది .
పెట్టిన దానికి కనీసం పావు వంతు కూడా డబ్బులు రాకుండా మేకర్స్ ను నిర్మాతలను కష్టాల్లో కూరుకుపోయేలా చేసింది . అయితే రీసెంట్గా ఇంటర్వ్యూలో నరేష్ – పవిత్రులకు టఫ్ క్వశ్చన్ ఎదురైంది. “మీరు పెళ్లి చేసుకున్న తరువాత పిల్లల్ని కంటారా..?” అంటూ బోల్డ్ గా ప్రశ్నించారు హోస్ట్ . ఈ క్రమంలోనే నరేష్ సైతం అంతే బోల్డ్ గా రియాక్ట్ అయ్యారు .
“మేము చాలా ఫీట్ ..ఫిజికల్ గా హెల్తీగా ఉన్నాం . పిల్లల్ని కనడానికి మాకు ఏ ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు మాకు 60 ఏజ్.. మేము ఇప్పుడు పిల్లలకంటే వాళ్ళకి 20 ఏళ్ళు వచ్చేసరికి మాకు 80 ఏళ్ళు వచ్చేస్తాయి .. తర్వాత పరిస్థితి ఏంటో ఆలోచిస్తున్నాం” అంటూ చాలా బోల్డ్ గా ఆన్సర్ ఇచ్చారు. అయితే పవిత్ర లోకేష్ నరేషులు పెళ్లి చేసుకోవడమే కాదు ..పిల్లల విషయంలో కూడా పక్కా క్లారిటీతో ఉన్నారు. ఇలాంటి క్లారిటీ ఉన్న మనిషికి చేతులెత్తి దండం పెట్టాల్సిందే అంటూ ఫన్నీ ఫన్నీగా మీమ్స్ క్రియేట్ చేసి ట్రోల్ చేస్తున్నారు ఆకతాయిలు..!!