Moviesఊరమాస్‌ బాలయ్య సినిమాకు ..క్యాచీ టైటిల్‌.. పేరుతోనే సిల్వర్ ...

ఊరమాస్‌ బాలయ్య సినిమాకు ..క్యాచీ టైటిల్‌.. పేరుతోనే సిల్వర్ స్క్రీన్ షేక్ చేసి పడేసాడుపో..!!

టాలీవుడ్ నటసింహం గా పేరు సంపాదించుకున్న నందమూరి బాలకృష్ణ లేటెస్ట్గా హీరోగా నటిస్తున్న సినిమా ఎన్బికె 108 . రీసెంట్ గానే వీర సింహారెడ్డి సినిమాలో నటించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న నందమూరి బాలయ్య.. అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఎన్.బి.కె 108 సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా మరో హీరోయిన్గా శ్రియ సరణ్ నటిస్తుంది అంటూ వార్తలు వినపడుతున్నాయి.

ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం అందుతుంది . వీరసింహారెడ్డి వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే పెట్టుకొని ఉన్నారు నందమూరి అభిమానులు. ఈ క్రమంలోని సినిమాలో క్యాస్ట్ అండ్ క్రూ కూడా అలాగే సెలెక్ట్ చేసుకున్నాడు అనిల్ రావిపూడి . ఈ సినిమాలో టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీ లీల బాలయ్య కూతురుగా నటించబోతుంది అంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది .

అయితే ఆయన సొంత కూతురు కాదు అన్న కూతురు అంటూ లేటెస్ట్గా ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే శ్రీలీలకు నాన్నగా చేస్తున్నది ఎవరు.. ఏ హీరో అన్నది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంచారు అనిల్ రావిపూడి . బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఎన్బికె 108 కి సంబంధించిన టీజర్ అలాగే టైటిల్ రిలీజ్ చేయబోతున్నారు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమా కోసం అనిల్ రావిపూడి ఓ క్యాచీ టైటిల్ అనుకున్నారట . అదే “బ్రో.. ఐ డోంట్ కేర్”.. ఇప్పటికే ఈ టైటిల్ను రిజిస్టర్ కూడా చేయించారట. దీంతో ఫస్ట్రా టైం బాలయ్య ఇంతటి క్యాచీ టైటిల్ తో రావడంతో అభిమానులు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బాలయ్య ఎనర్జీకి ఈ టైటిల్ చాలా బాగా సెట్ అవుతుందని చెప్పుకొస్తున్నారు. దీంతో పాత రికార్డ్స్ బద్దలవ్వడం ఖాయం అంటూ ఓపెన్ గానే కామెంట్స్ చేస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news