Moviesఆ విషయంలో మహేశ్ బాబే పెద్ద తోపు.. నెం 1 ..ఇంతకంటే...

ఆ విషయంలో మహేశ్ బాబే పెద్ద తోపు.. నెం 1 ..ఇంతకంటే ప్రూఫ్ కావాలా..?

మనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నారు . కొత్త కొత్త హీరోలు పుట్టుకొస్తున్నారు . నాన్న పేర్లు తాతల పేర్లు చెప్పుకొని ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తున్న హీరోలు ఎక్కువగా కనిపిస్తున్నారు. అయితే ఎంతమంది హీరోలు వచ్చినా .. ఎంతమంది పాన్ ఇండియా లెవల్ లో గుర్తింపు సంపాదించుకున్న.. గ్లోబల్ స్థాయిలో అవార్డులు అందుకున్న హీరో సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఉన్న క్రేజీ రికార్డ్ని మాత్రం బ్రేక్ చేయలేకపోతున్నారు. సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఇండస్ట్రీకి ఎన్నో హిట్ సినిమాలని ఇచ్చారు.

అంతేకాదు మహేష్ బాబు ప్రెసెంట్ వరుస సినిమాలకు కమిట్ అవుతూ బాక్స్ ఆఫీస్ రికార్డులను షేక్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే మహేష్ బాబుకి ఉన్న హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మార్కెట్లో ఉన్న వాల్యూ గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబుకి యూఎస్ మార్కెట్లో ఎక్కువగా ఫాన్ ఫాలోయింగ్ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే . ఆయన ఫ్లాప్ సినిమాలను సైతం అక్కడ అవలీలగా వన్ మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేస్తుంటాయి. కాగా మహేష్ బాబు నటించిన సినిమాలలో ఎక్కువగా యూఎస్ మార్కెట్లో క్రేజ్ లభిస్తూ ఉంటుంది .

మహేష్ బాబు యూఅస్ మార్కెట్లో ఎక్కువగా వన్ మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసిన సినిమాలలో దరిదాపుల్లో ఎవరూ లేరనే చెప్పాలి . దూకుడు సినిమా నుంచి సర్కారీ వారి పాట వరకు ఇప్పటివరకు ఏకంగా 11 సినిమాలు యూఎస్ బాక్స్ ఆఫీస్ దగ్గర వన్ మిలియన్ డాలర్స్ కి పైగా కలెక్ట్ చేసి మహేష్ బాబు స్టామినా ఏంటో ప్రూవ్ చేశాయి . ఇప్పటివరకు ఈ క్రేజీ రికార్డును బద్ధలు కొట్టిన ఏ తెలుగు సినిమా లేదు . దీంతో ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోలు ..గ్లోబల్ హీరోలు కాదు .. ఇలాంటి క్రేజీ రికార్డులను బద్దలు కొట్టే హీరో లేడా అంటూ మహేష్ బాబు అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. సౌత్ ఇండస్ట్రీలోనే అత్యధిక ఎక్కువ సినిమాలు వన్ మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసిన హీరోగా మహేష్ బాబు చెరగని రికార్డును సృష్టించాడు. ఇలా ఓవర్సీస్ లో వన్ మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసిన నెంబర్ వన్ హీరోగా మహేష్ బాబు టాప్ పొజిషన్లో ఉన్నాడు . ఆ తర్వాత నాని – ఎన్టీఆర్ చోటు దక్కించుకోవడం గమనార్హం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news