Moviesఈ బేబ్బమ్మకి ఇంకా బుద్ది రాలేదా..? మళ్ళీ అదే తప్పు చేస్తుందే..!!

ఈ బేబ్బమ్మకి ఇంకా బుద్ది రాలేదా..? మళ్ళీ అదే తప్పు చేస్తుందే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో బేబమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న కృతి శెట్టి పొజిషన్ ప్రెసెంట్ ఎలా ఉందో మనందరికీ బాగా తెలిసిన విషయమే . మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకొని ఓవర్ నైట్ లోని స్టార్ హీరోయిన్గా మారిపోయింది . ఆ తర్వాత నటించిన రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ కావడంతో బేబ్బమ్మను అదృష్ట దేవతగా భావించారు .

సీన్ కట్ చేస్తే ఆ తర్వాత రిలీజ్ అయిన నాలుగు సినిమాలో ఫ్లప్ అయ్యాయి. ఎంతలా అంటే కృతిశెట్టి పేరుని జనాలు మరిచిపోయేంతలా ఆమె డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది . ఈ క్రమంలోనే ఆమె రీసెంట్గా నటించిన కస్టడి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీనితో మేకర్స్ ఆమెతో సినిమా అంటేనే భయపడిపోతున్నారు . కాగా ఇలాంటి సమయంలోనూ కృతిశెట్టి నటనను నచ్చిన తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఆమెకు తన నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు అన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి .

అయితే వరుస ఫ్లాప్స్ పడుతున్న కృతి మాత్రం తన ర్వ్మ్యూనరేషన్ విషయంలో అస్సలు తగ్గడం లేదు అంటూ వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి . ఒక సినిమాకి రెండు నుంచి మూడు కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ జనాలకి డైరెక్టర్స్ కి చుక్కలు చూపిస్తుందట . ఫామ్ లో ఉన్న హీరోయిన్ అయితే పర్లేదు ఫ్లాప్ హీరోయిన్ కూడా ఇంత డిమాండ్ చేయడం న్యాయమా..? అంటూ మండిపడుతున్నారు . ఒకవేళ నిజంగా ఇది నిజమైతే మేకర్స్ కృతిశెట్టిని పక్కన పెట్టేక తప్పదు . అప్పుడు అవకాశాలు పోతాయి జీవితం సంక నాకి పోతుంది అంటూ జనాలు భారీ స్థాయిలో కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news