Moviesఫస్ట్ సినిమానే పాన్ ఇండియా.."మోక్షజ్ఞ" హీరోగా ఎంట్రీ ఖరారు..నందమూరి అభిమానులకి అరుపులు...

ఫస్ట్ సినిమానే పాన్ ఇండియా..”మోక్షజ్ఞ” హీరోగా ఎంట్రీ ఖరారు..నందమూరి అభిమానులకి అరుపులు పెట్టించే న్యూస్ వచ్చేసిందోచ్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటసింహంగా పేరు సంపాదించుకున్న నందమూరి బాలయ్యకు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా రీసెంట్గా నటించిన వీర సింహారెడ్డి సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న బాలయ్య ప్రజెంట్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో క్రేజీ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు . ఈ సినిమా అయిపోగానే బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో క్రేజీ ప్రాజెక్టు ఫైనలైజ్ చేశాడు అన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి .

ఈ సినిమా ద్వారానే తన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది అని జనాలు ఫిక్స్ అయిపోయారు. అయితే రీసెంట్ గా అందుతున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ ఈ సినిమా ద్వారా ఉండదని వచ్చే ఏడాది స్టార్టింగ్ లో ఆయన సినిమాకి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ ఇస్తారని.. మొదటి సినిమానే పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కే విధంగా ప్లాన్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తగ్గట్టే మోక్షజ్ఞ జాన్ జిగి ఫ్రెండ్ బెల్లంకొండ గణేష్ మోక్షజ్ఞ ఎంట్రీ పై పిచ్చ క్లారిటీ ఇచ్చారు.

రీసెంట్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ..”నేను మోక్షజ్ఞ చాలా మంచి ఫ్రెండ్స్ . మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రచ్చ సినిమా టైంలో మేమిద్దరం సినిమాలో తెగ అల్లరి చేసాం . రామ్ చరణ్ సినిమాలను చూస్తూ ఈల వేస్తూ గోల చేసాం . ప్రెసెంట్ మోక్షజ్ఞ సినిమాలో ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు . ప్రిపేర్ అవుతున్నాడు.. ట్రైన్ కూడా అవుతున్నాడు . వచ్చే ఏడాది మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఉంటుంది . మోక్షజ్ఞ చాలా టాలెంటెడ్ . కనుబొమ్మలతోనే నటించగలిగే సత్తా ఉన్న హీరో.. ఎన్టీఆర్ బాలయ్య తరహాలోనే ఆయనకి మంచి నటన స్కిల్స్ ఉన్నాయి” అంటూ క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో మోక్షజ్ఞ పేరు మరోసారి వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news