MoviesIntresting: ఆ ఒక్కటి దూరం పెడితే..మళ్ళీ సమంత-చైతన్య భార్యభర్తలుగా మారిపోవచ్చు..!!

Intresting: ఆ ఒక్కటి దూరం పెడితే..మళ్ళీ సమంత-చైతన్య భార్యభర్తలుగా మారిపోవచ్చు..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులర్ కి సంపాదించుకున్న సమంత – హీరో అక్కినేని నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే . ఏ మాయ చేసావే సినిమా ద్వారా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన సమంత మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అంతేనా ఆ తర్వాత హిట్ ఇచ్చిన హీరోనే తన లైఫ్ పార్టనర్గా చేసుకొని నాగచైతన్యను పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేసింది.

పట్టుమంటు పది సంవత్సరాలు కూడా కాపురం చేసుకోకుండానే ఈ జంట విడాకులు తీసేసుకున్నారు . ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఈ జంట నిరంతరం సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కి గురవుతూనే ఉన్నారు . కాగా రీసెంట్గా వీళ్ళకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . ఒకవేళ నిజంగా అక్కినేని ఫ్యాన్స్ కోరుకున్నట్లు సమంత – నాగచైతన్య ఒక్కటి అవ్వాలి అంటే వాళ్ళ ఈగోస్ పక్కన పెట్టాల్సిందే అంటున్నారు జనాలు.

ఇద్దరుకున్న ఈగోల కారణంగానే వాళ్ళు విడాకుల వరకు వెళ్లారని చెప్పుకొస్తున్నారు . రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో కూడా నాగచైతన్య మాట్లాడుతూ ..”సోషల్ మీడియాలో వచ్చే పుకార్ల వల్లే మా మధ్య మనస్పర్ధలు వచ్చాయని ..ఆ తర్వాత అవి తారస్థాయికి చేరి విడాకులు తీసుకున్నమని చెప్పుకొచ్చాడు “. ఈ క్రమంలోనే అలాంటి చిన్న కారణానికి విడాకులు తీసుకున్న ఈ జంట ఆ పట్టింపులను పక్కన పెట్టేస్తే మళ్లీ ఒక్కటయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు . చూద్దాం మరి ఫాన్స్ కోసం ఈ జంట ఏం చేస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news