టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్లే బ్యాక్ సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిన్మయి గురించి ఎంత చెప్పినా తక్కువే . ఎంత మంచి పాటలు పాడిందో… ఎంత మంచి సినిమాలుకు డబ్బింగ్ చెప్పిందో మనందరికీ బాగా తెలిసిన విషయమే .. అయితే సినిమాలపరంగా సింగింగ్ పరంగా కన్నా ఓ ఫెమినిస్ట్ లా బిహేవ్ చేస్తుంది అన్న కామెంట్లు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. సమాజంలో ఏది జరిగిన సరే సోషల్ మీడియా వేదికగా ఆడవాళ్లకు సపోర్ట్ చేస్తూ మగవాళ్ళని ఏకిపారేయడం.. మొదటి నుంచి ఉన్న లక్షణం అంటూ జనాలు చెప్పుకొస్తూ ఉంటారు .
రీసెంట్గా సింగర్ చిన్మయికి సంబంధించిన ఓ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు కుర్రాళ్ళు. సింగర్ చిన్మయి హీరో రాహుల్ రవీంద్రన్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాగా రీసెంట్గా వెన్నెల కిషోర్ హోస్ట్ చేస్తున్న అలా మొదలైంది షోకి వీళ్లిద్దరు గెస్ట్ లు గా వచ్చారు. ఈ క్రమంలోనే రాహుల్ రవీంద్రన్ – చిన్మయి ని ఎలా పడగొట్టాడో చెప్పారు . దీంతో ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .
కాగా ఇలాంటి క్రమంలోనే రాహుల్ రవీంద్రన్ కన్నా ముందే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో చిన్మయికి ప్రపోజ్ చేశాడని.. అయితే చిన్మయి అప్పటికి ప్రేమ – పెళ్లి అంటే నమ్మకం లేదు అంటూ అతని ప్రేమను రిజెక్ట్ చేసిందన్న వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ప్రజెంట్ ఆ హీరో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్నాడు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో చిన్మయి పేరు మారుమ్రోగిపోతుంది..!!