సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో .. ఈ మధ్యకాలంలో నరేష్ పవిత్ర ల పేర్లు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కొందరు ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారు అంటుంటే మరికొందరు కాదు కాదు ఈ జంట డేటింగ్ లోనే ఉన్నారు అంటూ చెప్పుకొస్తున్నారు . అయితే ఎవరు ఏమనుకున్నా సరే వాళ్ళ మధ్య ఉన్న ప్రేమని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ జంట . కాగా రీసెంట్గా ఈ జంట కలిసి నటిస్తున్న సినిమా “మళ్లీ పెళ్లి” .
త్వరలోనే ఈ సినిమా గ్రాండ్‌గా థియేటర్స్ రిలీజ్ కాబోతుంది . కాగా ఇలాంటి క్రమంలోనే అడపాదడపా పలు ఈవెంట్స్ లో.. షో ల లో మెరుస్తూ నరేష్ పవిత్ర స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. రీసెంట్గా నరేష్ – పవిత్ర.. ఓంకార్ హోస్ట్ చేస్తున్న సిక్త్ సెన్స్ సీజన్ సెవెన్ కి అటెండ్ అయ్యాడు . షోలో వీళ్ళు చేసిన రచ్చ అంత ఇంత కాదు .. మరి ముఖ్యంగా ఇద్దరు ఒకరినొకరు హగ్ చేసుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ .. ముద్దుల వర్షం కురిపించుకున్నారు .
ఆ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . అంతేకాదు ఓంకార్ ప్రశ్నిస్తూ మీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి అంటూ నరేష్ ప్రశ్నించగా..” భూమి బద్దలైన ..ఆకాశం నేల మీద పడ్డ ..మేం కలిసే ఉంటాం ..అది జరిగేది జరిగేది ” అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చారు . అంతేకాదు వీళ్ళిద్దరూ చాలా ఎంజాయ్ చేస్తూ ఈ గేమ్ ని ఆడారు. ఎక్కడ ఏ మాత్రం భయపడకుండా ఓపెన్‌గా తమ ప్రేమ విషయాన్ని బయటపడుతూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు . అంతేకాదు మీరు ముద్దుగా పవిత్రని ఏమని పిలుస్తారు అని ఓంకార్ నరేష్ ని అడగగా “అమ్ములు” అని ఇంకా ప్రేమ ఎక్కువైతే అమ్ము అని ఇంకా ప్రేమ ఎక్కువైతే వద్దులే చెప్తే బాగోదు అంటూ మాట దాటివేశారు . దీంతో వీళ్ళ పేర్లు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!