టాలీవుడ్ మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రాంచరణ్.. ప్రెసెంట్ ఓవైపు భార్యను జాగ్రత్తగా చూసుకుంటూనే మరోవైపు సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. మెగా కోడలు పిల్ల ఉపాసన ప్రెగ్నెంట్ అన్న విషయం అందరికి తెలిసిందే. పదేళ్లుగా మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా చూసిన గుడ్ న్యూస్ వినిపించేసరికి మెగాస్టార్ ఆనందపడిపోతున్నాడు.
ఈ క్రమంలో రాంచరణ్ అయితే భార్య చెయ్యి వదలట్లేదు . ఎక్కడికి వెళ్ళినా వెంటపట్టి తీసుకెళ్తున్నాడు . ఆమె తిరగాలి అనుకున్న చోట తిప్పేస్తున్నాడు . ఈ క్రమంలోనే ఎక్కువ ఫారిన్ టూర్స్ ఎంజాయ్ చేస్తున్న ఈ జంట ప్రజెంట్ ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంది. కాగా ఇదే క్రమంలో రాంచరణ్ ఓవైపు భార్య బాగోగులు చూసుకుంటూనే .. మరోవైపు తన నెక్స్ట్ సినిమాకి సంబంధించిన పనులను స్టార్ట్ చేశారు. మనకు తెలిసిందే చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు.
ఈ సినిమాలో ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారట . దీనికోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నాడట . ఈ పాత్ర కోసం తన బాడీ లాంగ్వేజ్ ని కూడా చాలా స్పెషల్ గా తీర్చిదిద్దబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. దీని కోసం స్పెషల్ మనిషిని పెట్టుకొని మరీ ఆ భాషలో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడట . అంతేకాదు ఇంటికి పిలిపించుకొని ఈ విధంగా ఇంట్లోనే సినిమా కోసం కష్టపడుతూ ఉన్నాడు రామ్ చరణ్ అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.
దీంతో భార్య కడుపుతో ఉండగా ఇలాంటి పనులు అవసరమా ..? లేక లేక పుట్టబోతున్న బిడ్డ జాగ్రత్తగా చూసుకోవాలి కదా అంటున్నారు. మరికొందరు కావాలని రామ్ చరణ్ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు . నువ్వు ఎంత సిన్సియర్ సింగామనుడివా..? ఆల్రెడీ గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్నావు కదా..? కోట్ల ఆస్తి ఉంది..? ఇంకెందుకు నీకు ఈ తాపత్రయం ..? అంటూ కావాలనే ట్రోల్ చేస్తున్నారు . దీంతో రాంచరణ్ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!