Moviesఓ మై గాడ్: శర్వానంద్ కి ఏమైంది..? ఎందుకు ఇలాంటి నిర్ణయం...

ఓ మై గాడ్: శర్వానంద్ కి ఏమైంది..? ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు..? ఫ్యాన్స్ హర్ట్..!!

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి పరిస్థితి ఎలా మారిపోతుందో ఎవరు గెస్ చేయలేరు . ఎలాంటి సిచువేషన్స్ లో నైనా ఎలాంటి పరిస్థితులైన ఎదుర్కోవడానికి స్టార్ హీరోలు రెడీగా ఉండాలి. కాగా ప్రెసెంట్ అలాంటిఓ అయోమయ స్థితిలోనే హీరో శర్వానంద్ ఉన్నాడు అంటూ సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి. మనకు తెలిసిందే శర్వానంద్ మల్టీ టాలెంటెడ్ హీరో . కేవలం హీరో గానే కాదు ఎలాంటి రోల్స్నైనా చేయగలడు .

కథ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండే శర్వానంద్ ఫ్యామిలీ కంటెంట్ ఉన్న కథలోనే నటిస్తాడు . ఎప్పుడు తన హద్దులు మీరనే లేదు . అందుకే శర్వానంద్ హిట్ కొట్టి చాలా కాలమే అవుతున్న ఇంకా ఆయనకి సోషల్ మీడియాలో ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడానికి కారణం అని చెప్పాలి . ప్రజెంట్ యంగ్ హీరోలలో ఒకరైన శర్వానంద్ టైం బాగోలేదు అంటూ పలువురు ఆయనని ట్రోల్ చేస్తున్నారు . ఈ మధ్యకాలంలో ఆయన హిట్ కొట్టిందే లేదు. “ఆడవాళ్లు మీకు జోహార్లు – ఒకే ఒక్క జీవితం” సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ వరుసగా ఫ్లాప్ లను ఖాతాలో వేసుకున్న శర్వానంద్ ..ప్రజెంట్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు .

అయితే ఇప్పటివరకు ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయనేలేదు . ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇవ్వనేలేదు. దీంతో అందరూ ఈ సినిమా క్యాన్సిల్ అయిపోయింది అంటూ ప్రచారం చేస్తున్నారు . అంతేకాదు శర్వానంద్ పెళ్లి విషయంలో కూడా మౌనం వహిస్తున్నాడు. జనవరిలో గ్రాండ్గా రక్షిత రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్న శర్వానంద్ ఆ తర్వాత పెళ్లి ఊసే ఎత్తట్లేదు . అసలు పెళ్లి ఉన్నట్టా ..? లేనట్టా..? అంటూ జనాలు అభిమానులు కూడా ఆయనను ప్రశ్నిస్తున్నారు.

అయితే శర్వానంద్ సడన్గా ఇంత సైలెంట్ అయిపోవడానికి కారణం ఆయన పర్సనల్ హెల్త్ ప్రాబ్లం అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది. శర్వానంద్ కి పర్సనల్ హెల్త్ ప్రాబ్లం కారణంగా ఇబ్బంది పడుతున్నాడని ..ఆ కారణంగానే సినిమాల విషయంలో పర్సనల్ లైఫ్ విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకోలేకపోతున్నాడు అంటూ ఓ న్యూస్ సినీ వర్గాలల్లో హల్ చల్ చేస్తుంది. అయితే దీనిపై ఇప్పటివరకు శర్వానంద్ స్పందించనే లేదు . ఇది నిజంగా నిజమేనా ..? లేకపోతే ఎవరైనా క్రియేట్ చేసిన పుకారా..? అన్నది తెలియాల్సి ఉంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news