ఎస్ .. ఇది నిజంగా అభిమానులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి . ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద స్టార్ కపుల్ గా పేరు సంపాదించుకున్న ఇంద్రనీల్ సేనా గుప్తా – బర్ఖ బిష్తా దంపతులు విడాకులు తీసుకోబోతున్నారు . ఇదే న్యూస్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు . ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ జంటలు ఏ విధంగా విడాకులు తీసుకొని దూరం బ్రతుకుతున్నారో. ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య హీరోయిన్ సమంత కూడా ఇలాగే విడాకులు తీసుకొని దూరంగా బ్రతుకుతున్నారు .
అంతే కాదు హీరో ధనుష్ డైరెక్టర్ ఐశ్వర్య కూడా ఇదేవిధంగా విడాకులు తీసుకొని సింగిల్ లైఫ్ కింగ్ అంటూ ఎంజాయ్ చేస్తున్నారు. కాగా ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో మరో జంట డివర్స్ అప్డేట్ వచ్చేసింది. పెళ్లయిన 15 ఏళ్ల తర్వాత తమ విడాకులు తీసుకోబోతున్నాము అంటూ అఫీషియల్ గా ప్రకటించింది ఈ జంట. అయితే ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన నటి బర్ఖ నటుడు భర్త ఇంద్రనీల్ సేన గుప్తా నుండి త్వరగా విడాకులు కన్ఫామ్ చేయాలని కోరుకుంటుంది .
అంతే కాదు ఇది తన జీవితంలో అత్యంత కఠినమైన నిర్ణయాలలో ఒకటి అంటూ కూడా చెప్పుకొచ్చింది. అంతేకాదు మా ఇద్దరికీ సెట్ అవ్వట్లేదు విడిపోవడమే బెటర్ అంటూ కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది . ఈ క్రమంలోనే 2008లో పెళ్లి చేసుకున్న ఈ జంటకు పదకొండేళ్ల మీరా సేన గుప్తా అనే పాప కూడా ఉంది . ఇలా ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడిపోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఏది ఏమైనా సరే ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో విడాకులు తీసుకుంటున్న జంటలు ఎక్కువగా కనిపిస్తున్నారు . చూడాలి మరి దీనికి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందో..?