ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో విడాకులు తీసుకుంటున్న జంటలు ఎక్కువగా కనిపిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత – నాగచైతన్య విడాకులు తీసుకొని దాదాపు ఒకటిన్నర సంవత్సరం కావస్తున్న సరే ..ఇప్పటికి వాళ్లకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. కాగా ఇలాంటి క్రమంలోనే వాళ్ళను ఆదర్శంగా తీసుకొని ఇండస్ట్రీలో చాలామంది జంటలు విడాకులు తీసుకుంటున్నారు .
రీసెంట్గా టాలీవుడ్ మెగా డాటర్ నిహారిక కూడా విడాకులు తీసుకోబోతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది . ఇదే క్రమంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇద్దరు స్టార్ జంటలు విడాకులు తీసుకోవడానికి కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు అన్న న్యూస్ ఇప్పుడు బాలీవుడ్ మీడియాని షేక్ చేస్తుంది. ఆ జంటలు ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ . మరో జంట బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న దీపికా పదుకునే – హీరో రన్వీర్ సింగ్.
ఎస్ ఈ ఇద్దరు జంటల త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారు అంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . దానికి కారణాలు లేకపోను లేదు . ఈ మధ్యకాలంలో వీరిద్దరూ భర్తలకు దూరంగా ఉంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . అంతేకాదు వీరు విడాకులు తీసుకోబోతున్నారు అని చెప్పడానికి హింట్లు కూడా ఇస్తున్నారు . ఈ క్రమంలోనే ఒకవేళ ఇదే జరిగితే ఇండస్ట్రీలోనే ఈ విడాకులు పెను సంచలనంగా మారబోతున్నాయి అంటున్నారు సినీ విశ్లేషకులు..!!