సాయిధరమ్ తేజ్ చిత్రలహరి
, సోలో బ్రతుకే సో బెటర్
, ప్రతి రోజు పండగే
వంటి డీసెంట్ హ్యాట్రిక్ హిట్ల తర్వాత రిపబ్లిక్
చిత్రంతో బోల్తా కొట్టాడు. ఈ సినిమా టైంలోనే జీవితంలోనే అతి పెద్ద ప్రమాదానికి గురయ్యి చావుఅంచుల వరకు వెళ్లి వచ్చాడు. ఇప్పుడు యాక్సిడెంట్ తర్వాత విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తన కెరీర్లోనే ఫస్ట్ టైం హర్రర్, థ్రిల్లర్, సస్పెన్స్, ఫాంటసీ ఇలా అన్ని గలగలిపిన సినిమాగా విరూపాక్ష తెరకెక్కింది.
సంయుక్తమీనన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. సుకుమార్ స్క్రీన్ అందించడంతో పాటు నిర్మాత బీవీఎస్ఎన్. ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విరూపాక్ష ఇప్పటికే ఓవర్సీస్లో ప్రీమియర్ షోలు కంప్లీట్ చేసుకుంది. మరి విరూపాక్ష ఎలా ఉందో చూద్దాం. ఓవరాల్‌గా సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది.
స్టోరీ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉందని.. స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్‌గా ఉందంటున్నారు. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అంశాలు అదిరిపోయాయని.. కాంతారా ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి పెద్ద అసెట్ అంటున్నారు. ఇక ప్రీ ఇంటర్వెల్లో చిల్ మూమెంట్స్…. సెకండాఫ్‌పై మరింత ఇంట్రస్ట్ కలిగేలా చేశాయట. ఇక ఫస్టాఫ్‌లో లవ్‌స్టోరీ మాత్రం కాస్త బోరింగ్‌గానే ఉందట. ఇక సినిమా కూడా స్లో గా సాగుతుందనే తెలుస్తోంది.
అయితే సెకండాఫ్‌లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయని.. ఆ సస్పెన్స్ సినిమా ఆసాంతం కంటిన్యూ అవుతుందని.. అదే ఆడియెన్స్‌ను బాగా ఎంగేజ్ చేస్తుందని అంటున్నారు. ఇక విరూపాక్ష ఓవరాల్‌గా ఓ డీసెంట్ మూవీ. ఈ సినిమా కథ 1980-90లో రుద్రవరం అనే విలేజ్‌లో మొదలవుతుంది. అప్పటి కొన్ని సంఘటనలు బేస్ చేసుకుని.. కొంత కల్పిత కథతో ఈ సినిమా కథ రాసుకున్నాడు దర్శకుడు కార్తీక్.
రుద్రవరం అనే విలేజ్‌లో వరుస మరణాలు… ఈ మిస్టరీ డెత్స్ వెనకాల ఎవరు ? ఉన్నారు. ఆ ఊరిని పట్టి పీడిస్తున్న శక్తి ఏంటనేది ? హీరో దానిని ఎలా ఎదుర్కొన్నాడు ? ఆ ఊరి ప్రజలకు ఎలా విముక్తి ఇచ్చాడు అన్నదే ఈ సినిమా స్టోరీ. ఓవరాల్‌గా ఈ సినిమాలో సాయితేజ్ చాలా కొత్తగా కనిపించాడు. లుక్, యాక్టింగ్ అదిరిపోయింది. సాయి తన పాత్రలో ఇన్వాల్ అయ్యి చేశాడట. సాయితేజ్ బౌన్స్ బ్యాక్ అయ్యే చిత్రమవుతుందని తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు.
ప్రీ క్లైమాక్స్ అదిరిపోయిందని.. విజువల్స్, వీఎఫ్ఎక్స్ గానీ, టెక్నికల్‌గానూ సినిమా బాగుందన్న టాక్ అయితే వచ్చేసింది. అయితే సినిమా స్లోగా మూవ్ అవ్వడం, లవ్‌స్టోరీ బోరింగ్‌గా ఉండడం కాస్త మైనస్ అంటున్నారు. ఏదేమైనా విరూపాక్షతో మొత్తానికి సాయితేజ్ ఖాతాలో మంచి హిట్ పడిందన్న కామెంట్లే ఎక్కువుగా వస్తున్నాయి.