Moviesఈ బుల్లితెర స్టార్ న‌టి మాజీ ముఖ్య‌మంత్రి మ‌న‌వ‌రాలే… చ‌దువులో ఇన్ని...

ఈ బుల్లితెర స్టార్ న‌టి మాజీ ముఖ్య‌మంత్రి మ‌న‌వ‌రాలే… చ‌దువులో ఇన్ని టాప్‌ ర్యాంకులా..!

బుల్లితెర ప్రేక్షకులకు జ్యోతిరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గత రెండు దశాబ్దాలలో ఎన్నో సీరియల్స్ లో.. ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి బుల్లితెర ప్రేక్షకులకు ఆమె బాగా దగ్గరయింది. ముఖ్యంగా జ్యోతిరెడ్డి అంటే లేడీ విలన్ పాత్రలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 9వ యేటే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె దాదాపు 30 ఏళ్లకు పైగా నటిస్తూనే ఉన్నారు. జ్యోతిరెడ్డి గురించి బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో పరిచయం ఉన్నా.. ఆమె ఎంత పాపులర్ నటి అయినా.. ఆమె ఒక మాజీ ముఖ్యమంత్రి మనవరాలు అన్న విషయం చాలామందికి తెలియదు.

ఈ విషయాన్ని ఆమె ఇటీవల స్వయంగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అంతేకాదు ఆమె చదువులో గోల్డ్ మెడలిస్ట్. కుటుంబానికి ఎంతో విలువ నిచ్చే ఆమె అమ్మ, నాన్న, భర్త, పిల్లల గుర్తుగా చేతునిండా పచ్చబొట్లు వేయించుకుంది. సమైక్యాంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేసిన భవనం వెంకటరామిరెడ్డి మనవరాలే ఈ జ్యోతి రెడ్డి. చిన్నప్పటి నుంచే చదువులలో ముందుండే ఆమె డిగ్రీ, పీజీలో వరుసగా మూడుసార్లు గోల్డ్ మెడల్ సంపాదించినట్లు తెలిపింది.

తనకు ఉద్యోగం చేయాలన్న కోరిక బలంగా ఉండేదని.. అయితే టాలీవుడ్ లో పెద్ద పెద్ద డైరెక్టర్లు తమ ప్రాజెక్టులలో నటించమని వారి పీఏలను తమ ఇంటికి పంపేవారని తెలిపింది. దీంతో తన తల్లి అంత పెద్ద పెద్ద డైరెక్టర్లు స్వయంగా ఇంటికి పీఏల‌ను పంపి మరీ అడుగుతున్నారు.. ఎందుకు ? నటించను అంటున్నావు… ఆ పాత్ర‌ల్లో న‌టించు అంటూ బ్రెయిన్ వాష్ చేయడంతో తాను యాక్టింగ్ ఫీల్డ్‌లోకి వచ్చానని తెలిపింది.

కేవలం తన తల్లి పట్టు పట్టడంతోనే తాను ఈ రంగంలోకి వచ్చి.. ఇప్పటికే విజయవంతంగా కొనసాగుతున్నానని షూటింగ్ లొకేషన్లో ఉన్నంతవరకు తనకు అందరూ మంచి స్నేహితులే… ఇంటికి వెళ్లిపోయాక తాను ఎవరితోనూ టచ్ లో ఉండనని జ్యోతిరెడ్డి తెలిపింది. తన భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని.. తనకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నట్టు జ్యోతిరెడ్డి తెలిపింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news