Moviesరెమ్యున‌రేష‌న్ అడుక్కోవాలా… క‌ల‌క‌లం రేపుతోన్న స‌మంత కామెంట్లు..!

రెమ్యున‌రేష‌న్ అడుక్కోవాలా… క‌ల‌క‌లం రేపుతోన్న స‌మంత కామెంట్లు..!

వైవిధ్య‌మైన పాత్రల్లో నటిస్తూ టాలీవుడ్ లో ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది సమంత. నాగచైతన్య లాంటి బలమైన సినీ నేపథ్యం ఉన్న హీరోను పెళ్లి చేసుకున్న సమంత నాలుగేళ్ల కాపురం తర్వాత విడాకులు తీసుకుంది. మరో హీరోయిన్ ఎవరైనా ఆ బాధ నుంచి బయటకు వచ్చి తిరిగి పుంజుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగటం అంటే కష్టమే. కానీ సమంత చాలా మొండిది.. ఆమె మనసులో ఎంత బాధ ఉన్నా.. ధైర్యంగా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఇప్పటికీ ఆ స్టార్ ఇమేజ్ అలాగే కొనసాగిస్తూ వస్తోంది.

అటు రొమాంటిక్ పాత్రలతో పాటు, హాట్ ఐటమ్ సాంగులు, లేడీ ఓరియంటెడ్ తో సినిమాలు.. వెబ్ సిరీస్ లు ఇలా ఎక్కడైనా నటిస్తోంది. రీసెంట్‌గా యశోద అనే థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత వచ్చే నెలలో శాకుంతలం సినిమాతో మరోసారి సత్తా చాట‌నుంది. ప్రస్తుతం శాకుంతలం సినిమా ప్రమోషన్లు జోరుగా నడుస్తున్నాయి. అలాగే విజయ్ దేవరకొండకు జోడిగా ఆమె నటిస్తున్న ఖుషి సినిమా కూడా ఈ ఏడాది రిలీజ్ కానుంది. ప్రమోషన్లలో మాట్లాడిన సామ్ నటీనటుల రెమ్యూనరేషన్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రతి ఒక్కరికి కష్టాన్ని చూసి దానికి తగ్గట్టుగా పారితోషకం ఇస్తే బాగుంటుందని సమంత అభిప్రాయపడింది. నా శ్రమ చూసి.. మేము మీకు ఇంత‌ రెమ్యూనరేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాం అని నిర్మాతలే చెప్పాలని.. నాకు ఇంత పారితోషం ఇవ్వండి అని నేను యాచించాల్సిన అవసరం లేదని కామెంట్ చేసింది. మన కృషి ఆధారంగా.. మన సామర్థ్యం ఆధారంగా రెమ్యూనరేషన్ వస్తుందని తాను నమ్ముతానని.. ఎప్పటికప్పుడు మన టాలెంట్ మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సమంత చెప్పింది.

ఇప్పుడు సమంత ఈ కామెంట్లను ఎవరిని ఉద్దేశించి చేసింది ? ఇండస్ట్రీలో ఎవరైనా ఈ విషయంలో ఆమెను ఇబ్బంది పెట్టారా ? అన్న చర్చ‌ కూడా నడుస్తుంది. సమంత విడాకుల తర్వాత కూడా రెమ్యూనరేషన్ విషయంలో ఏమాత్రం వెనకు తగ్గలేదు. ఒక్కో సినిమాకు మూడు కోట్లకు కాస్త అటు ఇటుగా తీసుకుంటుందని వినికిడి. సినిమా విషయానికి వస్తే గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ మైథిలాజికల్ మూవీ ఏప్రిల్ 14న రిలీజ్ అవుతుంది. సమంత లీడ్ రోల్ పోషించగా దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news