Moviesరానా-బాలయ్య: ఈ ఇద్దరిలో ఆ డేరింగ్ పనికి ఎవరు సెట్ అవుతారు.....

రానా-బాలయ్య: ఈ ఇద్దరిలో ఆ డేరింగ్ పనికి ఎవరు సెట్ అవుతారు.. గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండ్రా అబ్బాయిలు..!!

ఎస్ ప్రెసెంట్ .. సోషల్ మీడియాలో ఇదే న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . మనకు తెలిసిందే తెలుగులో అతిపెద్ద రియాలిటీ షోగా స్టార్ట్ అయిన బిగ్ బాస్ ఇప్పటికే సక్సెస్ ఫుల్గా ఆరు సీజన్లు కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే ఏడో సీజన్ స్టార్ట్ చేయబోతుంది . అయితే ఎప్పటిలా కాకుండా ఈసారి బిగ్ బాస్ రూల్స్ మారబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అంతేకాదు కంటెస్టెంట్ ల సంఖ్య కూడా ఈసారి భారీగా పెంచేటట్లు సోషల్ మీడియాలో న్యూస్ లీక్ అవుతుంది .

కొత్త రూల్స్ తో కొత్త కంటెస్టెంట్స్ తో ఈసారి బిగ్ బాస్ ధూమ్ ధామ్ అంటూ అదిరిపోతుంది అని బుల్లితెర విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు . అయితే కంటెస్టెంట్స్ , రూల్స్ ఏ కాదు ఈసారి హోస్ట్ కూడా మారబోతున్నాడు అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. ఇప్పటికే నాలుగు సీజన్లు వరుసగా హోస్ట్ చేసిన నాగార్జున ఈ షో నుంచి తప్పుకున్నట్లు ఓ న్యూస్ కన్ఫర్మ్ అవుతుంది . అంతేకాదు ఆ ప్లేస్ లోకి నందమూరి బాలకృష్ణను తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

అన్ స్టాపబుల్ షో ద్వారా హోస్ట్ గా అవతారం ఎత్తిన బాలయ్య .. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి కూడా హోస్టింగ్ చేయబోతున్నాడు అంటూ సినీ వర్గాలలో ఓ వార్త హల్చల్ చేస్తుంది . అయితే ఆయనకి కాంపిటీషన్ గా మరో హీరో కూడా రేస్ లో ఉన్నట్లు తెలుస్తుంది . దగ్గుబాటి వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రానా దగ్గుబాటి కూడా బిగ్ బాస్ సెవెన్ హోస్టింగ్ కోసం కాంపిటీషన్ ఇస్తున్నాడు అంటూ న్యూస్ ట్రెండ్ అవుతుంది .

ఈ క్రమంలోని దగ్గుబాటి ఫ్యాన్స్ వ్స్ నందమూరి ఫ్యాన్స్ మధ్య టఫ్ పోల్ జరుగుతుంది. బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి ఎవరైతే హోస్ట్ గా బాగుంటారు.. ఎవరైతే సరైన న్యాయం చేస్తారు అన్న కోణంలో పోల్స్ కండక్ట్ చేస్తున్నారు . ఆశ్చర్యం ఏంటంటే ఈ పోల్లో 80 శాతం మంది నందమూరి బాలయ్యకే ఓట్లు వేస్తూ ఉండడం గమనార్హం. కొంతమంది రానాకు సపోర్ట్ చేస్తున్న చాలామంది బాలయ్యకే ఓట్లు వేస్తున్నారు. మరి మీ దృష్టిలో బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి హోస్టుగా ఎవరు సెట్ అవుతారు.. యంగ్ హీరోగా పేరు సంపాదించుకున్న దగ్గుబాటి రానా నా..? సీనియర్ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రిని ఏలేస్తున్న నందమూరి బాలయ్య నా..? కామెంట్స్ రూపంలో మీ ఆన్సర్ తెలియజేయండి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news