గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో ఓ ఫోటో తెగ హల్చల్ చేస్తుంది. ఈ ఫోటో చూసిన జనాలు పూర్తిగా షాక్ అయిపోతున్నారు ఇంతటి బడా ప్రొడ్యూసర్ కూతురు ఇలాంటి పనులు చేస్తుందా..? అంటూ షాక్ అయిపోతున్నారు . ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తిని గుర్తుపట్టారా ..? ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లలో ఒకరుగా ఉన్న బోనీ కపూర్ కూతురు ..
బోనీకపూర్ కూతురు అనగానే జాన్వి కపూర్ , ఖుషి కపూర్ అనుకునేరు కాదు కాదు.. ఆయనకు శ్రీదేవి కంటే ముందు పెళ్లి జరిగింది . ఆమెకు పుట్టిన బిడ్డే అర్జున్ కపూర్ . అర్జున్ కపూర్ కు ఓ చెల్లెలు కూడా ఉంది . ఆమె అన్షులా కపూర్ . సో.. ఎంత కాదు అనుకున్నా ఈమె కూడా శ్రీదేవి కూతురే. ప్రస్తుతం ఈమె ప్రేమలో పడింది . ఈ అమ్మాయి ప్రేమలో పడింది ఎవరితోనో కాదు ప్రముఖ స్క్రీన్ రైటర్ రోహన్ థక్కర్ తో . ఆమె కొన్నాళ్ళుగా అతనితో డేటింగ్ చేస్తుంది అంటూ బాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది .
తన రిలేషన్ ని కన్ఫామ్ చేస్తూ అన్షులా కపూర్.. సోషల్ మీడియాలో ఓ పిక్ పోస్ట్ చేసింది. రోహన్ థక్కర్ తో స్విమ్మింగ్ పూల్ లో దిగిన ఒక రొమాంటిక్ ఫోటోను 366 కామెంట్ పెట్టింది . ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ మాల్దీవుల్లో ఉన్నట్లు క్లియర్ గా తెలుస్తుంది . అంతేకాదు ఇలా పెళ్లికి ముందే ఈ విధంగా పబ్లిక్ తో రొమాన్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు . మరోవైపు బాలీవుడ్ లో ఇదంతా కామన్ అని త్వరలోనే ఈ జంట పెళ్లికి ముందే గుడ్ న్యూస్ చెప్పబోతుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి . చూడాలి మరి దీనిపై అన్షులా కపూర్ ఏ విధంగా స్పందిస్తుందో..?