సినిమా ఇండస్ట్రీలో లవ్ మ్యారేజ్ లు చాలా కామన్. దాదాపు 100 కి 90 శాతం మంది అందరు ప్రేమించే పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఏదైనా సినిమా చేసేటప్పుడు ఆ షూట్లో ఒకరినొకరు అర్థం చేసుకుని.. ఆ తర్వాత తమ ప్రేమను ఇంట్లో పెద్దలకు చెప్పి ఒప్పించి గ్రాండ్గా పెళ్లి చేసుకుంటారు. ఇలా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు ఇండస్ట్రీలో పెళ్లి చేసుకోవడం సర్వసాధారణం . అయితే ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు రాజకీయ నేతలను రాజకీయ ప్రముఖులను పెళ్లి చేసుకోవడం కొంచెం డిఫరెంట్ .
తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది బాలీవుడ్ హాట్ బ్యూటీ పరిణితి చోప్రా. ఎస్ త్వరలోనే ఈ బ్యూటీ పెళ్లి పీటలు ఎక్కబోతుంది.. అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . అయితే ఈ ప్రచారంలో నిజం కూడా లేకపోనులేదు. ఆప్ ఎంపీ రాఘవ చద్ధ తో ఆమె రిలేషన్ లో ఉన్నారు అంటూ ఇటీవల చాలా వార్తలు వినిపించాయి. వారిద్దరు కలిసి పార్టీలకు హాజరైన వీడియోలు, ఫోటోలు కూడా సోషల్ మీడియాలో లీకై వైరల్ అయ్యాయి .
తాజాగా ఇదే నేపథ్యంలో వారిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుంది అంటూ కొత్తగా ప్రచారం జరుగుతుంది . ఈ క్రమంలోనే బాలీవుడ్ మీడియా ఈ జంట పెళ్లి చేసుకోబోతుంది అంటూ కూడా వార్తలు రాస్తుంది . కాగా దీనిపై తాజాగా ఎంపీ సంజీవ్ అరోరా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు . “నా హృదయపూర్వక శుభాకాంక్షలు.. వారిద్దరి కలయిక ప్రేమ ఆనందం స్నేహంతో కలకాలం కొనసాగాలని ఆశిస్తున్నాను” అంటూ ట్వీట్ చేసాడు. దీంతో ఈ విషయం అఫీషియల్ అయిపోయింది . ఈ క్రమంలోనే త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారని .. అందుకే మరో ఎంపీ ఇలా కామెంట్ చేశారని అంటుంటే .. కంగ్రాట్స్ బోత్ ఆఫ్ యు అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు . మొత్తానికి రూమర్స్ ని సక్సెస్ ఫుల్ గా నిజం చేశారు ఈ జంట అంటూ మరి కొంతమంది ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు..!!