Moviesఎక్కడికి వెళ్ళినా సమంత తెల్ల బట్టలే ఎందుకు ధరిస్తుందో తెలుసా..? దాని...

ఎక్కడికి వెళ్ళినా సమంత తెల్ల బట్టలే ఎందుకు ధరిస్తుందో తెలుసా..? దాని వెనుక ఉన్న అసలు రీజన్ ఇదే..!!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ సమంత కి ఎలాంటి ప్లేస్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏం మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సమంత.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది . అంతకుముందు అరా కొరా యాడ్స్ లో కనిపించినా సరే ఏం మాయ చేసావే సినిమాతోనే తన పేరుని జనాలకు తెలిసేలా చూసుకుంది. కాగా ఈ సినిమాలో హీరోగా నటించిన నాగచైతన్య నే ప్రేమించి.. పెళ్లి చేసుకున్న సమంత .. వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని దూరం గా ఉంటున్నారు.

కాగా రీసెంట్గా సమంత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమా ఏప్రిల్ 17న గ్రాండ్గా పాన్ ఇండియా లెవెల్ లో థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్న సమంత.. తన లైఫ్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది . అయితే ఈ మధ్యకాలంలో సమంత బయట ఎక్కడ కనిపించిన తెల్లటి దుస్తుల్లోనే కనిపిస్తూ ఉండడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.

సమంత పలు మోడరన్ దుస్తులను ఫోటోషూట్స్ కోసం ధరిస్తుంది తప్పిస్తే పర్సనల్ పని మీద ఎక్కడికి వెళ్ళినా సరే తెల్లటి దుస్తులను ప్రిఫర్ చేస్తుంది. మొన్నటికీ మొన్న శాకుంతలం సినిమా ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసే భాగంగా పెద్దమ్మతల్లి గుడికి వెళ్ళిన సమంత ట్రెడిషనల్ తెల్ల దుస్తుల్లో మెరిసింది. ఆ తర్వాత బయట ఈవెంట్స్ లో కనిపించిన కూడా తెల్లటి చీరలలో లేదా తెల్లటి చుడిదార్ లోనే కనిపిస్తుంది తప్పిస్తే ఎక్కడా కూడా వేరే రంగు దుస్తులు ధరించడం లేదు.

ఈ క్రమంలోనే సమంత ఎందుకు తెలుపు వస్త్రాన్ని ధరిస్తుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం సమంత తన మనుషులని తన చుట్టూ వాతావరణన్ని ప్రశాంతంగా ఉంచేలా చూసుకుంటుందని.. శాంతి వైపుగా అడుగులు వేయాలనుకుంటుంది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . ఇదే క్రమంలో సమంత రీసెంట్గా ధరించిన వైట్ చుడిదార్ ఫోటోషూట్స్ కూడా ట్రెండ్ చేస్తున్నారు. సమంత పూర్తిగా మారిపోయింది అని చెప్పడానికి ఈ యొక్క మార్పు చాలు అంటూ ఫ్యాన్స్ ఆమె మార్పుని స్వాగతిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news