Moviesచిరంజీవి చేసిన చిన్న తప్పే మెగా ఫ్యామిలీ కి శాపంగా మారిందా..?...

చిరంజీవి చేసిన చిన్న తప్పే మెగా ఫ్యామిలీ కి శాపంగా మారిందా..? ఏళ్ళు గడుస్తున్న పాపం తగ్గట్లేదా..?

ఇప్పుడు ఎక్కడ చూసిన మెగా డాటర్ నీహారిక-చైతన్య ల పేర్లు ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతున్నాయి. చైతన్య పెళ్లి ఫోటోలను డిలిట్ చేయడంతో..నిహారిక కూడా విడాకులు తీసుకోబోతుంది అంటూ కన్ఫామ్ చేసేసుకున్నారు మెగా అభిమానులు . అయితే ఎందుకు మెగా డాటర్స్ ఇలా విడాకులు తీసుకొని సోషల్ మీడియాలో మెగా పరువు తీసేస్తున్నారు అంటూ కొందరు ఫాన్స్ బాధపడిపోతున్నారు. ఇలాంటి క్రమంలోనే కొందరు యాంటీ మెగా ఫాన్స్ చిరంజీవిని సైతం ట్రోల్ చేస్తూ మెగా ఫ్యామిలీకి అది ఓ శాపం అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు .

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత టాలీవుడ్ లవర్ బాయ్ గా పేరు సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ తో నిశ్చితార్ధం చేసుకుని బ్రేకప్ చెప్పేసుకున్నారు . ఆ తర్వాత శ్రీజ ఎలాంటి లవ్ ట్రాక్ లు నడిపిందో అందరికీ తెలిసిందే . ఇలాంటి క్రమంలోనే మెగా డాటర్ నిహారిక విడాకుల మేటర్ సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే దీని అంతటికి కారణం గతంలో చిరంజీవి ఉదయ్ కిరణ్ విషయంలో చేసిన తప్పే అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు.

ఉదయ్ కిరణ్ తో నిశ్చితార్థం చేసుకున్న తర్వాత పెళ్లిని ఆపేయడం కరెక్ట్ కాదని.. ఆ ఫ్యామిలీ ఉసురే మెగా ఫ్యామిలీకి శాపంగా మారింది అంటూ కొందరు ఆకతాయిలు టైం చూసి చిరంజీవి పేరు ట్రోల్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే చిరంజీవి పేరు హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతుంది. అయితే మెగా ఫాన్స్ మాత్రం చిరంజీవి పరిస్థితిని చూసి బాధ పడిపోతున్నారు . కూత్ర్లు చేసిన తప్పుకి తండ్రిని తప్పు పట్టడం కరెక్ట్ కాదు అంటూ కామెంట్ చేస్తున్నారు . ఏది ఏమైనా సరే మెగా ఫ్యామిలీని కావాలనే కొందరు టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారని క్లియర్గా అర్థం అయిపోతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news