Moviesఆ టాలీవుడ్ కుర్ర డైరెక్ట‌ర్ ర‌ష్మిక‌ను అస్స‌లు వ‌దిలేలా లేడే... ఏంటి...

ఆ టాలీవుడ్ కుర్ర డైరెక్ట‌ర్ ర‌ష్మిక‌ను అస్స‌లు వ‌దిలేలా లేడే… ఏంటి ఆ స్పెష‌ల్ ఇంట్ర‌స్ట్‌..!

టాలీవుడ్ లో ప్రస్తుతం రష్మిక మందన్న జోరు మామూలుగా లేదు. టాలీవుడ్లో ఆమెకు వచ్చిన క్రేజ్ కు అటు కోలీవుడ్ లోను ఇటు బాలీవుడ్ లోను వరుసగా అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో పుష్ప తర్వాత ఆడవాళ్లు మీకు జోహార్లు, సీతారామన్, సినిమాలలో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ లో వరుసగా అవకాశాలు రావడంతో అక్కడికి షిఫ్ట్ అయింది. రష్మిక ఎన్నో ఆశలతో బాలీవుడ్లోకి ఎంటర్ అయినా అక్కడ ఆమె నటించిన సినిమాలు సక్సెస్ కాలేదు.

దీంతో ఇప్పుడు ఆమె తిరిగి తనను స్టార్ హీరోయిన్ ను చేసిన టాలీవుడ్ వైపు దృష్టిసారిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె మరో సినిమాకు సైన్ చేసినట్టు తెలుస్తోంది. అయితే రష్మిక ఈ సినిమాకు సైన్ చేయడానికి ప్రధాన కారణం డైరెక్టర్ వల్లే. ఆ డైరెక్టర్ ఎవరో కాదు వెంకీ కుడుముల. వెంకీ డైరెక్ట్ చేసిన తొలి సినిమాతోనే రష్మిక టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఛలో సినిమా సూపర్ హిట్ అయింది.

ఆ తర్వాత నితిన్ తో ఆమె నటించిన భీష్మ సినిమా కూడా బ్లాక్ బస్టర్. ఇప్పుడు అదే వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా ఒక సినిమా వస్తోంది. ఈ సినిమాలో కూడా రష్మికనే హీరోయిన్గా తీసుకోవాలని వెంకీ పిక్స్ అయిపోయారట. దీంతో రష్మిక బాలీవుడ్ లో ఎంత బిజీగా ఉన్నా తెలుగులో తనకు తొలి ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ కావడంతో వెంటనే నితిన్ సినిమాకు ఓకే చెప్పేసిందట. పైగా భీష్మ సినిమాలో రష్మిక, నితిన్ జంటకు మంచి పేరు వచ్చింది.

ప్రస్తుతం అల్లు అర్జున్ తో సినిమాలో నటిస్తున్న.. ఆ సినిమాలో ఆమె పాత్ర చిన్నది కావడంతో ఇప్పుడు టాలీవుడ్ లో ఆమెకు మరో ప్రాజెక్ట్ అంటూ లేకుండా పోయింది. దీంతో నితిన్, వెంకీ కాంబినేషన్లో సినిమాకు ఓకే చెప్పేసింది. ఏది ఏమైనా వెంకీ కుడుముల రష్మికను మాత్రం వదలకుండా వెంటపడుతున్నట్టే కనిపిస్తోంది. అటు రష్మిక కూడా వెంకీకి మంచి లక్కి హీరోయిన్గా మారిపోయింది..!!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news